నైజీరియాలో కిడ్నాపైన 137 మంది స్టూడెంట్లు విడుదల

నైజీరియాలో కిడ్నాపైన 137 మంది స్టూడెంట్లు విడుదల
అబుజా: రెండు వారాల కింద నైజీరియాలోని ఓ స్కూల్ నుంచి కిడ్నాపైన 300 మంది చిన్నారులలో 137 మంది విడుదలయ్యారు. మార్చి 7న కడునా రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామం నుంచి స్కూల్ స్టూడెంట్లను బందిపోట్లు కిడ్నాప్ చేశారు. అడ్డుకునేందుకు యత్నించిన ఓ వ్యక్తిని కాల్చి చంపేశారు. పిల్లలను విడుదల చేసేందుకు వారు రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. 
 
చివరికి బందిపోట్లకు అడ్డాగా ఉన్న జాంఫారా రాష్ట్రం నుంచి కిడ్నాపైన స్టూడెంట్లలో 137 మందిని రక్షించినట్లు నైజీరియా సైన్యం ఆదివారం వెల్లడించింది. మిగతావాళ్లను విడిపించేదాకా ప్రయత్నాలు కొనసాగిస్తామంది. స్టూడెంట్లను సేఫ్​గా ఇండ్లకు చేర్చిన సైన్యానికి నైజీరియా ప్రెసిడెంట్ బోలా అహ్మద్ టినుబు కృతజ్ఞతలు తెలిపారు.