టొరంటోలో కాల్పులు.. ఐదుగురు మృతి

టొరంటోలో కాల్పులు..   ఐదుగురు మృతి
  • అపార్ట్​మెంట్​ లక్ష్యంగా ఫైరింగ్​
  • పోలీసుల కాల్పుల్లో నిందితుడు మృతి

టొరంటో: కెనడాలోని టొరంటోలో దారుణం జరిగింది. ఓ అపార్ట్​మెంట్​లో ఉంటున్న వారిని లక్ష్యంగా చేసుకుని జరిగిన కాల్పుల్లో ఐదుగురు చనిపోయారు. మరో0 వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. అతన్ని దగ్గర్లోని ప్రైవేట్ హాస్పిటల్​కు తరలించారు. అతని పరిస్థితి క్రిటికల్​గానే ఉందని డాక్టర్లు ప్రకటించారు. ఈ ఘటన కెనడా రాజధాని టొరంటోకు 30 కిలో మీటర్ల దూరంలోని వుఘాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీలో ఆదివారం సాయంత్రం జరిగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు చనిపోయాడు. ఫైరింగ్ గురించి స్థానికులు సమాచారం ఇవ్వడంతో వెంటనే వచ్చి చూడగా.. అపార్ట్​మెంట్​లోని ఫ్లాట్స్​లో కొందరు చనిపోయి ఉన్నారని యార్క్​ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో నిందితుడికి తమకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో అతను చనిపోయాడన్నారు. చనిపోయిన వాళ్లకు, నిందితుడికి మధ్య ఎలాంటి సంబంధం ఉందన్న కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు. కాల్పులకు తెగబడిన వ్యక్తి అపార్ట్​మెంట్​కు చెందిన వాడా.. బయటివాడా.. అనేది తెలియాల్సి ఉందన్నారు. ఎందుకు ఫైరింగ్ చేశాడో కారణం తెలీదని వివరించారు.

జోర్డాన్​లో ముగ్గురు పోలీసులు మృతి

దక్షిణ జోర్డాన్​లోని మాన్ సిటీలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులు చనిపోయారు. పోయిన వారం డిప్యూటీ పోలీస్ డైరెక్టర్ అబ్దుల్ రజాక్ అబ్దెల్ హఫీజ్ అల్ దలాబేను హత్య చేసిన నిందితులను అరెస్ట్​ చేసేందుకు వెళ్లిన టైంలో ఈ ఘటన జరిగింది. కాల్పుల్లో ప్రధాన నిందితుడు కూడా చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. తొమ్మిది మంది అనుమానితులను అరెస్టు చేసినట్టు ప్రకటించారు. ఈ ఏరియాలో ఇస్లామిక్​ స్టేట్​ టెర్రరిస్ట్​ గ్రూప్​సపోర్టర్స్ ఉంటారని పోలీసులు వివరించారు.