క్యాబ్​ను అడ్డుకుని దోపిడీ.. బ్లేడ్ తో దాడి

క్యాబ్​ను అడ్డుకుని దోపిడీ.. బ్లేడ్ తో దాడి

జీడిమెట్ల, వెలుగు: క్యాబ్​ను అడ్డగించి ప్యాసింజర్లను దోపిడీ చేసి.. డ్రైవర్ పై బ్లేడ్​తో దుండగులు దాడి చేశారు. జీడిమెట్ల పోలీసులు తెలిపిన ప్రకారం.. రాజేంద్రనగర్ పరిధి బుద్వేల్​కు చెందిన అనిల్​(24) క్యాబ్​డ్రైవర్.​ గురువారం తెల్లవారుజామున స్విఫ్ట్​డిజైర్​కారులో మాదాపూర్​ లో ఇద్దరు సాఫ్ట్​వేర్​ ఇంజనీర్లను ఎక్కించుకుని నెహ్రూనగర్​లో డ్రాప్​చేసేందుకు వెళ్తున్నాడు.

సుమారు 2.30 గంటల షాపూర్ నగర్ లో మెయిన్ రోడ్డుపై 5 మంది దుండగులు నిలబడి కారును అడ్డుకుని డబ్బులు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఇద్దరు ప్యాసింజర్ల వద్ద సెల్​ఫోన్లు​లాక్కున్నారు. అడ్డుకున్న డ్రైవర్​​మెడపై బ్లేడ్​తో దాడిచేసి దుండగులు పారిపోయారు.డ్రైవర్ తీవ్రంగా గాయపడగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదుతో జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.