ముంబై: ఈ వారం కూడా దేశీయ ప్రైమరీ మార్కెట్ (ఐపీఓ) జోరు కొనసాగనుంది. మొత్తం 5 కొత్త ఐపీఓలు సబ్‌స్క్రిప్షన్ కోసం రానుండగా, 4 కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ కాబోతున్నాయి. ముఖ్యంగా మెయిన్‌బోర్డ్ విభాగంలో ఎక్స్‌ట్రానెట్ టెక్నాలజీస్, క్యూబ్ హైవేస్ ట్రస్ట్ ఇన్విట్‌లపై ఇన్వెస్టర్ల ముందుకొస్తున్నాయి.
మెయిన్‌బోర్డ్ ఐపీఓలు
1) ఎక్స్‌ట్రానెట్ టెక్నాలజీస్ : ఈ కంపెనీ ఐపీఓ జులై 23న ప్రారంభమై 27న ముగుస్తుంది. మొత్తం రూ. 166.8 కోట్లు సేకరించనున్నారు. షేరు ధర రూ. 120 -– రూ. 127 గా నిర్ణయించారు. ఒక లాట్‌కు 110 షేర్లు (కనీస పెట్టుబడి రూ. 13,970). ఈ ఐటీ సంస్థ ఐపీఓ ద్వారా సేకరించిన నిధులను అప్పుల చెల్లింపు, హార్డ్‌వేర్ కొనుగోళ్లకు వాడనుంది.
2) క్యూబ్ హైవేస్ ట్రస్ట్ ఇన్విట్: ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 5 వేల కోట్లను సేకరించాలని కంపెనీ చూస్తోంది. ఐపీఓ ఈ నెల 22న ఓపెనై, 24న ముగుస్తుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో దీర్ఘకాలంలో లాభాలను పొందడానికి ఇది అనుకూలం.
3) గల్ఫ్ లాయిడ్స్ ఇండియా, మెటాలిక్ టెక్నోఫోర్జ్, శ్రీ బాలాజీ మాలా టెక్స్‌టైల్స్ కంపెనీల ఎస్‌ఎంఈ ఐపీఓలు ఈ నెల 20 నుంచి 24 వరకు జరుగుతాయి.
4) గత వారం ముగిసిన ఐపీఓలలో ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ లిస్టింగ్‌పై భారీ అంచనాలున్నాయి. రూ. 9,813 కోట్ల ఈ అతిపెద్ద ఐపీఓ ఏకంగా 40 రెట్లు పైగా సబ్‌స్క్రయిబ్ అయి, రూ. 2.98 లక్షల కోట్ల విలువైన బిడ్స్ అందుకుంది. గ్రే మార్కెట్ ప్రీమియం 16 శాతం ఉండటంతో ఇన్వెస్టర్లు లిస్టింగ్ గెయిన్స్ ఆశిస్తున్నారు. మరోవైపు మిల్‌వర్క్స్ టెక్నాలజీస్ 100శాతం పైగా జీఎంపీతో దూసుకుపోతోంది. ఆల్పైన్ టెక్స్‌వరల్డ్, సోటెఫిన్ భారత్ లిస్టింగ్‌లపై కూడా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నారు.
