అంతర్జాతీయ నగరాల కంటే మన ఢిల్లీనే నయం.. డేటింగ్, లివింగ్ ఖర్చు అన్నీ అగ్గువే..!

అంతర్జాతీయ నగరాల కంటే మన ఢిల్లీనే నయం.. డేటింగ్, లివింగ్ ఖర్చు అన్నీ అగ్గువే..!

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత చౌకైన రొమాంటిక్ డేట్ నగరంగా ఢిల్లీ నిలిచింది. డాయిష్​బ్యాంక్​ రిపోర్ట్ ప్రకారం.. మన దేశ రాజధానిలో డేట్ కోసం సగటున రూ.9,920 ఖర్చవుతుండగా, జెనీవాలో అత్యధికంగా రూ.45,750 చెల్లించాల్సి వస్తోంది. ఈ డేట్‎లో వైన్ బాటిల్, జీన్స్, డ్రెస్, రెండు కాఫీలు, ఇద్దరి భోజనం, రెండు సినిమా టిక్కెట్లు, రవాణా, ఐదు కిలోమీటర్ల ట్యాక్సీ ప్రయాణ ఖర్చులు ఉన్నాయి. మరోవైపు  బ్రాడ్ బ్యాండ్ నెట్​ప్లాన్​నెల ధర ఢిల్లీలో రూ.703 ఉంది. 

ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇంటర్నెట్ అందిస్తున్న నగరంగా నిలిచింది. ఖర్చులు తక్కువగా ఉన్నప్పటికీ ఢిల్లీ ప్రజల జీతాలు మాత్రం తక్కువ. ఇక్కడి సగటు నెలవారీ నికర జీతం రూ.51,800  ఉంది. ఇది న్యూయార్క్ జీతాల్లో 10 శాతమే. జీతాల జాబితాలో జ్యూరిచ్ నగరం రూ.8.05 లక్షల సగటు జీతంతో మొదటిస్థానంలో నిలిచింది. ఢిల్లీలో స్థిరాస్తులు, మద్యం ధరలూ తక్కువగానే ఉన్నాయని ఈ రిపోర్ట్​ వెల్లడించింది.