హైదరాబాద్ టీ – హబ్‎లో అండ్ పర్పస్ ఫోరం సదస్సు

హైదరాబాద్ టీ – హబ్‎లో అండ్ పర్పస్ ఫోరం సదస్సు

హైదరాబాద్, వెలుగు: సోషల్​ఎంటర్​ప్రిన్యూర్​షిప్, సస్టయినబిలిటీ, కార్పొరేట్​సోషల్​రెస్పాన్సిబిలిటీపై చర్చించడానికి అండ్ పర్పస్ ఫోరమ్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని టీ–-హబ్‌‌‌‌‌‌‌‌లో సదస్సు నిర్వహించింది. ప్రభుత్వం, పరిశ్రమలు, స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు, విద్యారంగానికి చెందిన 200మందికిపైగా ప్రముఖులు పాల్గొన్నారు. భారతదేశ సర్కులర్ ​ఎకానమీ పర్యావరణ బాధ్యత మాత్రమే కాదని, 2030 నాటికి 300 నుంచి 400 బిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక అవకాశాలను అందిస్తుందని ఆర్‌‌‌‌‌‌‌‌ఈ సస్టైనబిలిటీ సీఈఓ మసూద్ మల్లిక్ తెలిపారు. అన్ని రంగాలు కలిసికట్టుగా పనిచేసినప్పుడే ఈ స్థాయి వృద్ధి సాధ్యమవుతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.