యూపీఐపై ఎండీఆర్ విధింపుతో మర్చంట్లకు, కస్టమర్లకు నష్టమే..!

యూపీఐపై ఎండీఆర్ విధింపుతో మర్చంట్లకు, కస్టమర్లకు నష్టమే..!

న్యూఢిల్లీ: రూ.రెండు వేలుపైబడిన యూపీఐ లావాదేవీలపై 0.5 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)​విధించడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువని ఫైనాన్షియల్ టెక్నాలజీ నిపుణులు అంటున్నారు. ఈ చార్జీని ఎవరు భరిస్తారనే దానిపై దృష్టి పెట్టాలని చెబుతున్నారు. ఎండీఆర్​ భారం వ్యాపారులకు అదనపు నిర్వహణ ఖర్చు అవుతుంది. 

లాభాలను, వినియోగదారులకు ఇచ్చే డిస్కౌంట్లను తగ్గిస్తుంది. ముఖ్యంగా చిన్న కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారస్తులపై ఎండీఆర్​ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రూ.10 వంటి తక్కువ విలువ గల యూపీఐ పేమెంట్లను వ్యాపారులు తిరస్కరించే ప్రమాదం ఉంది. దీనివల్ల డిజిటల్ చెల్లింపుల వేగం తగ్గుతుందని ఫిన్​టెక్​ ఎక్స్​పర్టులు అంటున్నారు.