గత 24 గంటల్లో ఐదుగురు టెర్రరిస్టులు హతం

గత 24 గంటల్లో ఐదుగురు టెర్రరిస్టులు హతం

గడిచిన 24 గంటల్లో అయిదుగురు టెర్రిరిస్టులను అంతమొందించినట్లు భద్రతాబలగాలు వెల్లడించాయి. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. కుల్గామ్ జిల్లా జోడార్ ఏరియాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను  భద్రతాబలగాలు కాల్చిచంపాయి. చనిపోయిన ఉగ్రవాదులు ఇద్దరూ లష్కరే-ఇ-తోయిబాకు చెందిన వారని అధికారులు చెప్పారు. ఈ ఆపరేషన్‌లో స్థానిక పోలీసులు కూడా పాల్గొన్నారు. ఇక పుల్వామా జిల్లా పుచల్ ఏరియాలో కశ్మీర్ జోన్ పోలీసులు మరో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. సైన్యం, స్థానిక పోలీసులు కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా.. టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. 

బుధవారం ఉదయం హంద్వారాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిదిన్‌కు చెందిన టాప్ కమాండర్ మెహ్రజుద్దీన్ హల్వాయ్ అలియాస్ ఉబైద్‌ను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. ఉబైద్ చాలా ఏళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ చెప్పారు. ఉబైద్ పలు నేరాల్లో కీలక నిందితుడిగా ఉన్నాడని ఆయన అన్నారు. మొత్తంగా గత 24 గంటల్లో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. భద్రతా బలగాలకు ఇదో పెద్ద సక్సెస్ అని ఐజీపీ అన్నారు.