ఉన్నత విద్య కోసం కేంద్రం కొత్త 5 ఏళ్ల ప్లాన్: నిధులు, విద్యా ఫలితాలకు లింక్..

ఉన్నత విద్య కోసం కేంద్రం కొత్త 5 ఏళ్ల ప్లాన్: నిధులు, విద్యా ఫలితాలకు లింక్..

ఉన్నత విద్య కోసం కేంద్రం ఐదు కీలక లక్ష్యాలతో ఐదు ఏళ్ల  ప్లాన్ రెడీ చేస్తోంది. వీటిలో ఎక్కువ మందిని ఎడ్యుకేషన్లో చేర్చడం, ఉద్యోగాలు - అప్రెంటిస్‌షిప్‌లు పెంచడం, అంతర్జాతీయ సంబంధాలను నిర్మించడం, నాణ్యత పెంచడం, డిజిటల్ పద్ధతులు బలోపేతం చేయడం ఉన్నాయి.  

ఈ ప్లాన్ ముఖ్యమైన పెద్ద ప్రాజెక్టులు, రాష్ట్రాల వారీగా లక్ష్యాలు, పనితీరుకు అనుగుణంగా నిధులు ఇవ్వడం అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. నాణ్యత కోసం విద్యా సంస్థలకు స్పష్టమైన అక్రిడిటేషన్ (గుర్తింపు) బ్యాండ్‌లు ఇస్తారు. దీనివల్ల విద్యార్థులు ఏ కోర్సు మంచిదో ఈజీగా తెలుసుకోవచ్చు అలాగే డిమాండ్/ ఫ్యూచర్ సరిగా లేని కోర్సులను మూసేస్తారు.

క్యాంపస్‌లకు లింక్ అయ్యే ఒక జాతీయ అప్రెంటిస్‌షిప్ & ప్లేస్‌మెంట్ ఎక్స్ఛేంజ్ ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి నిర్దిష్టంగా ఎంత మందిని చదువులో చేర్చాలనే లక్ష్యాలు (GER) నిర్ణయించబడతాయి. నిధుల విషయంలో భవనాలు, ల్యాబ్‌ల కోసం ఇచ్చే డబ్బును ఉపాధ్యాయుల జీతాలు, నిర్వహణ ఖర్చుల నుండి వేరు చేస్తారు. అధికారులు ఫలితాల ఆధారంగా నిధులు అమలు చేయాలనుకుంటున్నారు. అంటే, లక్ష్యాలు పూర్తి చేశారని నిరూపించిన తర్వాతే మిగిలిన నిధులు ఇస్తారు.

ఒక ఇంటర్నల్ రిపోర్ట్  ప్రకారం, మంచి సంస్థలు బలహీనమైన క్యాంపస్‌లకు సహాయం చేస్తాయి. ఉపాధ్యాయులు, ల్యాబ్‌లు, సిలబస్ పంచుకోవడం ద్వారా త్వరగా ఫలితాలు పెంచడానికి ప్రయత్నిస్తాయి.కేవలం భవనాలు వంటి వాటికే కాకుండా విద్యార్థులు ఎంత బాగా నేర్చుకుంటున్నారు, ఎంత మందికి ఉద్యోగాలు వస్తున్నాయి అనే పనితీరు ఆధారంగా నిధులు ముడిపెడతారు. స్పష్టమైన లక్ష్యాలు, ఎవరు బాధ్యత వహించాలి, స్పష్టమైన సమాచారం... ఇదే మా విధానం," అని విద్యా మంత్రిత్వ శాఖ అధికారి చెప్పారు.

డిగ్రీలను ఉద్యోగాలతో కనెక్ట్ చేయడానికి  నేషనల్ అప్రెంటిస్‌షిప్ అండ్ ప్లేస్‌మెంట్ ఎక్స్ఛేంజ్ ను క్యాంపస్ రికార్డుల (ERP) తో కలుపుతారు. దీనివల్ల కంపెనీలు ఉద్యోగ ఖాళీలను పోస్ట్ చేయవచ్చు, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు, ఇంటర్వ్యూలు ట్రాక్ చేయవచ్చు, ఆఫర్లు పొందవచ్చు అది కూడా అన్నీ ఒకే వేదికపై. ఒకే వేదిక ఉండడం వల్ల విద్యార్థులకు, కంపెనీలకు ఇబ్బందులు తగ్గుతాయి" అని ఒక అధికారి తెలిపారు. విదేశీ విద్యార్థుల కోసం, పేపర్ వర్క్ తగ్గించడానికి అలాగే  భారతీయ క్యాంపస్‌లలో చేరడం సులభం చేయడానికి ఒకే విండో వీసా, FRRO రిజిస్ట్రేషన్ & హౌసింగ్‌ నిర్వహిస్తుంది.