న్యూఢిల్లీ, వెలుగు: గతేడాది జనవరి–జులై మధ్య కాలంలో పెద్దపల్లికి క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ (సీజీఎస్) కింద ఎంఎస్ఈల కోసం రూ.50 కోట్ల విలువైన 468 గ్యారెంటీలను అమోదించినట్టు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు గురువారం లోక్‌సభలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి సుశ్రీ శోభా కరంద్లాజే రాతపూర్వక సమాధానం ఇచ్చారు. గతేడాది డిసెంబర్ 31 వరకు మ్యాన్‌ఫ్యాక్చరింగ్ రంగంలో మంచిర్యాలకు 438, జగిత్యాలకు 457, పెద్దపల్లికి 310 గ్యారెంటీల కోసం నిధులు అప్రూవ్ చేసినట్టు వెల్లడించారు.
