రంగారెడ్డి జిల్లా: ఒకే పరీక్ష కేంద్రం నుంచి 44 మంది డిబార్

రంగారెడ్డి జిల్లా: ఒకే పరీక్ష కేంద్రం నుంచి 44 మంది డిబార్

రంగారెడ్డి జిల్లా: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో చివరి రోజు రంగా రెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రంలో 44 మందిని డిబార్ చేయడం జరిగింది. ఈ పరిక్షా కేంద్రంలో ఐదు కళాశాలలకు చెందిన 276 మంది విద్యార్థులు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు రాయాల్సి ఉండగా.. అందులో 5 మంది గైర్హాజరయ్యారు. ఈ రోజు (బుధవారం) పరీక్ష రాస్తున్న 271 మంది విద్యార్థులలొ కెమిస్ట్రీ-21, కామర్స్-23 మొత్తం 44 మంది మాస్ కాపీయింగ్ పాల్పడుతున్నారని.. ఇంటర్మీడియట్ బోర్డ్ అబ్సర్వర్లు గుర్తించారు. ఈ రోజు రంగా రెడ్డి జిల్లా అమన్ గల్ కళాశాలలో 6 మంది, యాచారం జూనియర్ కళాశాలలో 44 మంది మొత్తం 50 మంది విద్యార్థులను డిబార్ చేసినట్లు డీఐఈవో సుధారాణి తెలిపారు.