గ్రీన్లాండ్ ఐస్ షీట్ కింద కొత్తగా 56 సబ్ గ్రేసియల్ లేక్స్బయటపడ్డాయి. ఈ సరస్సులను గతంలో ఎప్పుడూ గుర్తించలేదని, తాజాగా గుర్తించిన వాటితో గ్రీన్లాండ్లో మొత్తం సరస్సుల సంఖ్య 60కి చేరాయని సైంటిస్టులు తెలిపారు. అంటార్కిటికాలో ఉండే ఇలాంటి లేక్స్‌తో పోలిస్తే ఇవి చాలా చిన్నగా ఉన్నట్టు వెల్లడించారు. గ్రీన్లాండ్ ఐస్ షీట్ కింద సరస్సులు ఉండే అవకాశాలు తక్కువని గతంలో అంచనా వేశారు. అయితే ఇక్కడ లేక్స్చాలా ఉన్నాయని ఇప్పుడు గుర్తించారు. ఈ మేరకు నేచర్ కమ్యూనికేషన్ జర్నల్‌లో ఓ స్టడీ పబ్లిష్ అయ్యింది. ఈ స్టడీ కోసం సుమారు 5 లక్షల కిలోమీటర్ల ఎయిర్‌బోర్న్ రేడియో ఇకో సౌండింగ్ డాటాను సైంటిస్టులు అనలైజ్ చేశారు. ఈ డాటా ఆధారంగా గ్రీన్లాండ్ ఐస్ షీట్ కింద ఇమేజ్‌లను పరిశీలించవచ్చు.
రీసెర్చ్ టీమ్ మొత్తంగా 54 సబ్ గ్రేసియల్ లేక్స్‌ను, మంచు ఉపరితలం ఆధారంగా మార్పులు చెందే మరో రెండు సరస్సులను గుర్తించింది. ఈ రీసెర్చ్‌లో పాల్గొన్న టీమ్‌కు అంటార్కిటికాలోని సబ్ గ్రేసియల్ లేక్స్‌పై మంచి అవగాహన ఉందని బ్రిటన్‌లోని లాన్సస్టర్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టు జేడ్ బౌలింగ్ చెప్పారు. గ్రీన్లాండ్ ఐస్షీట్ కింద సబ్గ్రేసియల్ లేక్స్ ఏర్పాటు.. వాటి స్థితిగతులపై ఇప్పటి వరకూ ఎటువంటి సమాచారం లేదని, తాజా పరిశోధనతో తొలిసారిగా ఐస్లాండ్లోని సబ్ గ్రేసియల్ సరస్సులకు సంబంధించి ఒక అవగాహన ఏర్పడిందని అన్నారు. సబ్ గ్రేసియల్ హైడ్రోలాజికల్ సిస్టమ్‌ను, ఐస్ఫ్లో డైనమిక్స్‌ను అర్థం చేసుకోవడానికి, పరిశీలించడానికి ఇది చాలా కీలకమని చెప్పారు. ప్రస్తుతం గుర్తించిన లేక్స్పరిమాణం 0.2 కిలోమీటర్ల నుంచి 5.9 కిలోమీటర్ల వరకూ ఉంది. వీటిలో మెజారిటీ లైక్స్‌లో ఐస్ మూవ్మెంట్ చాలా నెమ్మదిగా ఉంది. భవిష్యత్తులో వాతావరణం మరింత వేడెక్కి.. మంచు కరిగిపోతే వచ్చే నీటి ద్వారా మరిన్ని సబ్ గ్రేసియల్ లేక్స్ ఏర్పడతాయని సైంటిస్టులు చెబుతున్నారు.
