కాంట్రాక్ట్​ ఉద్యోగులకు సగం జీతం కట్.!

కాంట్రాక్ట్​ ఉద్యోగులకు సగం జీతం కట్.!
  •     ఖర్చు తగ్గించుకునే పనిలో  రాష్ట్ర ప్రభుత్వం
  •     ఆగస్టు వరకు రెగ్యులర్​ ఉద్యోగుల జీతాల్లో కోత తప్పదా?
  •     అధికార వర్గాల్లో కొనసాగుతున్న చర్చ
  •     కిస్తీల చెల్లింపునకు తప్పని తిప్పలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు తగ్గించుకోవాలని చూస్తోంది. తప్పనిసరి ఖర్చులు తప్ప మిగతా వాటికి సంబంధించిన నిధుల్లో కోత విధించాలని భావిస్తోంది. లాక్​డౌన్​ కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గిపోయింది. దీంతో ఖర్చును తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇదే క్రమంలో.. వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్​ సోర్సింగ్ ఉద్యోగాల్లో 50 శాతం కోత విధించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రెగ్యులర్​ ఉద్యోగులకు కూడా మార్చి మాదిరిగానే ఏప్రిల్​లోనూ జీతాల్లో సగం కోత పెట్టాలని ఇప్పటికే నిర్ణయం జరిగిపోయింది. ఇదే పరిస్థితి ఆగస్టు వరకు ఉండొచ్చని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఎంతమంది ఉన్నరు.. ఏమేం పనిచేస్తున్నరు?

కాంట్రాక్ట్, ఔట్​ సోర్సింగ్ ఉద్యోగులు ఎంత మంది ఉన్నారు..? వాళ్లు ఏమేం పనిచేస్తున్నారు..?  అనే వివరాలు సేకరించే పనిలో రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఏజెన్సీల కింద దాదాపు లక్ష మంది కాంట్రాక్ట్, ఔట్​ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి ప్రతి నెల దాదాపు రూ. 900 కోట్లు జీతాలుగా ప్రభుత్వం చెల్లిస్తోంది.  ఇందులో సగం మందికి పూర్తి స్థాయి పని ఉండటం లేదన్న భావన ఉన్నతాధికారుల్లో ఉంది. ఖర్చులు తగ్గించుకునే పనిలో భాగంగా.. అవసరం లేని వారిని ఇంటికి పంపించే ఆలోచనలో ఉన్నట్టు ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనికి సీఎం అంగీకరిస్తే దాదాపు 40 వేల నుంచి 50 వేల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఓ సీనియర్ ఆఫీసర్​ చెప్పారు.

జీతాల్లో కోతతో 1,500 కోట్లు మిగులు

దేశవ్యాప్తంగా లాక్ డౌన్​ను  మే 3 వరకు పొడిగించడంతో ఉద్యోగులు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు, మంత్రుల ఏప్రిల్  జీతానికి కావాల్సిన ఆర్థిక వనరులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రతి నెలా వీళ్ల జీతాల కోసం దాదాపు రూ. 3,500 కోట్లు ఖర్చు అవుతుంటుంది. లాక్ డౌన్ కారణంగా మార్చి నెల జీతాల్లో కొంత మేరకు ఇవ్వడంతో ఖజానాలో దాదాపు రూ. 1,500 కోట్లు ఖర్చు మిగిలింది. రెండు రోజుల క్రితం ఆర్బీఐ వద్ద జరిగిన బాండ్ల వేలం పాటలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 వేల కోట్ల రుణం పొందింది. ఈ నిధులను లాక్ డౌన్ సమయంలో తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు రూ. 1,500 చొప్పున ఆర్థిక సాయం కింద దాదాపు రూ. 1,120 కోట్లు ఖర్చు చేసింది. మిగతా నిధులను ఏప్రిల్ జీతాల కోసం కేటాయించే చాన్స్​ ఉంది. వివిధ శాఖల దగ్గరున్న డిపాజిట్లు దాదాపు రూ. 3 వేల కోట్లను ఆర్థిక శాఖ వెనక్కి తీసుకునే పనిలో పడింది. ఈ నిధులను కూడా జీతాల కోసం కేటాయించే చాన్స్​ ఉన్నట్టు తెలిసింది. ఏప్రిల్​ నెల జీతాలు కూడా 50 శాతం ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం జరిగింది. ఆగస్టు వరకు కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కిస్తీల చెల్లింపు కష్టమే

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వివిధ రుణాల కింద ప్రతి నెలా దాదాపు రూ. 3,400 కోట్ల కిస్తీలు చెల్లించాలి. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో బకాయిలను చెల్లింపును 6 నెలల పాటు వాయిదా వేయాలని సీఎం కేసీఆర్.. ప్రధాని మోడీకి లేఖ రాశారు. దీనిపై కేంద్రం నుంచి ఇంకా స్పందన రాలేదని తెలిసింది. బకాయిల చెల్లింపు వాయిదా వేయాలని తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాలు నుంచి పెద్దగా డిమాండ్ లేదని ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రం తీసుకున్న అప్పులతో పాటు వివిధ కార్పొరేషన్ల కింద తీసుకున్న రుణానికి ప్రతి నెలా కిస్తీలు దాదాపు రూ