టెస్ట్ క్రికెట్పై భజ్జీ ఎంత మాట అనేశాడు భయ్యా.. పెద్ద డిబేట్కు తెరలేపాడుగా..!

టెస్ట్ క్రికెట్పై భజ్జీ ఎంత మాట అనేశాడు భయ్యా.. పెద్ద డిబేట్కు తెరలేపాడుగా..!

ఇండియా-సౌతాఫ్రికా టెస్టు సందర్భంగా చిత్ర విచిత్రమైన కామెంట్స్, విశ్లేషణలకు కారణమైంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న టెస్టు సందర్భంగా ఒకటి రెండు రోజుల్లోనే టెస్టు ముగిసే పరిస్థితిపై సీనియర్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ప్లేయర్ మధ్య ఓ పెద్ద డిబేటే జరిగిందని చెప్పాలి.

టెస్టులో భాగంగా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత ఇండియా కేవలం 30 రన్స్ తో స్వల్ప ఆధిక్యాన్ని సాధించగలిగింది. 2వ రోజు స్టంప్స్ వరకు సఫారీ జట్టు 7 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసి కష్టాల్లో పడింది. ఆశ్చర్యకరంగా వాళ్లు కూడా ఎక్కువ లీడ్ ను ఇండియా ముందు ఉంచలేకపోయారు. కేవలం 63 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉండటం ఆశ్చర్యానికి గురిచేసింది.

రెండో రోజు ఆటలో తొలి సెషన్‌ను పేసర్లు కంట్రోల్ చేయగా, ఆ తర్వాత స్పిన్నర్లు గ్రిప్ సాధించారు. అయితే పిచ్ ఊహించని రీతిలో బౌన్స్ అవుతుండటంతో  రెండు ఇన్నింగ్స్‌లలో 17 వికెట్లు పడిపోవడం పై ఘాటు వ్యాఖ్యలు చేశారు సీనియర్లు. 12 వికెట్లను పంచుకున్నారు.

రెండు రోజుల్లోనే ఆట ముగిసే పరిస్థితి, ఒకే రోజు అన్ని వికెట్లు పడటంపై సీనియర్ ప్లేయర్ హర్భజన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. భజ్జీ వ్యాఖ్యలు పెద్ద డిబేట్ కు దారితీశాయి. క్రికెట్ లో అతిపెద్ద ఫార్మాట్ అయిన టెస్టు.. ఇలా ఒకటి రెండు రోజుల్లో క్లోజ్ కావడం.. ఇది టెస్టా లేక వన్డేనా లేక టీ20 నా అనే కోణంలో చాలా గట్టిగా ఇచ్చిపడేశాడు భజ్జీ. ఇండియా vs దక్షిణాఫ్రికా ఆట 2వ రోజుల్లోనే దాదాపు పూర్తయింది. టెస్ట్ క్రికెట్‌ను ఎంత అవమానం.. అంటూనే.. ఆత్మకు శాంతికూరాలి అని వాడే పదాన్ని టెస్ట్ క్రికెట్ కు వాడుతూ తన ఆగ్రహాన్ని వెల్లబుచ్చాడు.  #RIPTESTCRICKET అని హర్భజన్ పోస్ట్ చేశాడు. 

భజ్జీ పోస్ట్ కు  మైఖేల్ వాన్  రిప్లై ఇచ్చాడు. కోల్‌కతాలో భయంకరమైన పిచ్ అని కామెంట్ చేశాడు. దీనిపై ఆస్ట్రేలియా సీనియర్ ప్లేయర్ స్పందిస్తూ.. కోల్‌కతాలో మనం చూస్తున్న వికెట్  గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఫీల్డర్లు బ్యాట్‌పై గుమిగూడి ఉండటం, బంతి బాగా టర్న్ అవుతుంటేచూడటం చాలా ఇష్టం.. నేను ఎంజాయ్ చేస్తానని అన్నాడు. 

అయితే రవిచంద్రన్ అశ్విన్ ఈడెన్ గార్డెన్న పిచ్ ను సమర్థించాడు. బ్యాటింగ్ టెక్నిక్‌ లేనప్పుడు పిచ్ ను నిందిచడం కరెక్ట్ కాదని అన్నాడు. అందరూ విఫలమైనా టెంబా బావుమా ఎలా ఆడగలిగాడంటూ ప్రశ్నించాడు.