T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతుండటంతో.. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ ట్రోలింగ్ హద్దులు దాటుతూ, అతని సోదరి కోమల్‌ను కూడా లక్ష్యంగా చేసుకుంది. ప్రపంచ నెంబర్–1 టీ20 అంతర్జాతీయ బ్యాటర్‌గా టోర్నీలోకి అడుగు పెట్టిన అభిషేక్, గ్రూప్ దశలో జరిగిన మూడు మ్యాచుల్లో వరుస డకౌట్లతో తీవ్ర నిరాశపరిచాడు. అమెరికా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన అతను, ఆ తర్వాత పాకిస్తాన్, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో కూడా ఖాతా తెరవలేకపోయాడు. సూపర్–8 దశకు ముందు అభిషేక్ ఫామ్ భారత్ టైటిల్ అవకాశాలపై ప్రభావం పడింది.
ట్రోలింగ్:
అభిషేక్ శర్మ ఫామ్‌పై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న చర్చలోకి కొందరు అతని సోదరి కోమల్ శర్మని విమర్శించడం స్టార్ట్ చేశారు. స్టేడియంలోకి ఆమె రావడంతో పాటు అభిషేక్ బ్యాటింగ్ లో విఫలం కావడానికి ప్రధాన కారణం “డిస్ట్రాక్షన్” అంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. అభిషేక్ సోదరికి అనవసరంగా క్రికెట్ కి సంబంధించిన చర్చలు తీసుకు రావడంపై క్రీడా విశ్లేషకులు మండిపడుతున్నారు. బీసీసీఐ రూల్స్ ప్రకారం, ఆటగాళ్ల కుటుంబ సభ్యులు మ్యాచ్‌లకు వచ్చి మద్దతు ఇవ్వడంపై ఎలాంటి నిషేధం లేదు.. ముఖ్యంగా స్వదేశంలో జరుగుతున్న టోర్నీలో కుటుంబ సభ్యుల హాజరు కావడం కామన్ అని పేర్కొంటుంది.
ఇంతకీ కోమల్ శర్మ ఎవరు:
అభిషేక్ శర్మ సోదరి కోమల్ శర్మ ఫిజియోథెరపిస్ట్. ఐపీఎల్‌తో పాటు అభిషేక్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరిన సమయంలో కూడా ఆమె తరచుగా స్టేడియంలో కనిపించి అభికి మద్దతు ఇచ్చింది. దీనిని ఇప్పుడు నెగటివ్‌గా చూపించడం అన్యాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో డక్ అవుట్ కావడంతో, అభిషేక్ ఈ ఏడాది టీ20 ఫార్మాట్‌లో ఓపెనర్‌గా ఐదుసార్లు డకౌట్లు అయినా ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ జాబితాలో పాకిస్తాన్‌కు చెందిన సైమ్ అయూబ్ (2025లో 6 డకౌట్లు) అగ్రస్థానంలో ఉండగా, అభిషేక్ ఐదు డకౌట్లతో కొనసాగుతున్నాడు.
The main reason for the downfall of Abhishek Sharma is his sister. Whenever he goes to play, she comes for attention and does overacting. He is not some baby other players also have sisters, but they don’t do like this. pic.twitter.com/DRJbwAfv30
— MARCUS (@MARCUS907935) February 20, 2026
Meanwhile Komal Sharma waiting to click family pictures with POTM despite Abhishek Sharma's failures. pic.twitter.com/MbL6wEhWmz
— Deepu (@deepu_drops) February 18, 2026
