జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నవగ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాలను మార్చుకుంటాయి. అత్యంత క్రూరమైన గ్రహాల్లో రాహువు గ్రహం ఒకటి.. ఈ గ్రహం చాలా అరుదుగా ఒకచోటి నుంచి మరొక చోటికి ప్రవేశిస్తుంది. ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత రాహు గ్రహం నవంబర్ 23 వ తేదీ సొంత నక్షత్రం శతభిషం లోకి ప్రవేశించబోతోంది. ఆ నక్షత్రంలోనే 2026 సంవత్సరం ఆగస్టు రెండవ తేదీ వరకు శతభిషా నక్షత్రంలోనే రాహువు కొనసాగుతాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఈ సమయం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . .
మేష రాశి: రాహువు నక్షత్ర మార్పు ఈ రాశివారికి చాలా శుభ్రపదంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. , రాహువు తన సొంత నక్షత్రం శతభిషంలో సంచరిస్తుందన, ఈ రాశివారి జీవితంలో అకస్మాత్తుగా మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. గతంలో కోల్పోయిన డబ్బును తిరిగి పొందుతారు. మానసికంగా మంచి మార్పులు వస్తాయి. ఏ పని తలపెట్టినా ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయి. ఒక సంస్థలో అత్యున్నత పదవిని పొందే సూచనలున్నాయి. వ్యాపారాలు లేదా స్టార్టప్ లు ప్రారంభించడానికి కూడా అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది.
మిథున రాశి : రాహువు శతభిష నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల మిథున రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. గతంలో ఉన్న ఇబ్బందులు ఈ సమయంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. పదోన్నతులు, గుర్తింపు, మరియు ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.వ్యాపారం చేసే వారికి కూడా ఈ కాలం లాభదాయకంగా ఉంటుంది. పెట్టుబడులు సక్రమంగా ఫలించి, వ్యాపార విస్తరణకు అవకాశం ఉంటుంది. కుటుంబ విషయాలలో సంతోషం నెలకొంటుంది.
ALSO READ : ఏడాది వరకు మీ పిల్లల్ని ఇలా పెంచండి..
కర్కాటక రాశి : రాహువు నక్షత్ర మార్పు వలన ఈ రాశివారు అత్యధిక లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ కాలంలో కొత్త ప్రాజెక్టులలో పని చేయడానికి అవకాశాలు రావచ్చు. ఉద్యోగస్తులకు ఈ కాలంలో వీరికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. వ్యాపారం చేసేవారికి లాభాలు రెట్టింపు అవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త భాగస్వామ్యాలు, కొత్త కాంట్రాక్టులు రావచ్చు.
కన్య రాశి : రాహువు .. శతభిషానక్షత్రంలో సంచారం వలప ఈ రాశి వారి ఆర్ధిక పరిస్థితి మెరుగు పడుతుంది. అనుకోకుండా ఊహించని రీతిలో డబ్బు చేతికి అందుతుంది. ఈ కాలంలో పెట్టుబడులు పెట్టినట్లయితే భారీగాలాభాలు పొందే అవకాశం ఉంటుంది.. అసంపూర్ణ పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. గతంలో రావలసిన సొమ్ము, రాదనుకున్న సొమ్ము చేతికి అందే అవకాశం ఏంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయ. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. పిల్లల కోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు. ప్రేమ .. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
ధనుస్సు రాశి : రాహువు నక్షత్రం మార్పు ఈ రాశి వారికి అదృష్టంలో చాలా మెరుగుదలను తెస్తుంది. ఈ రాశి వారికి అదనంగా వివిధ మార్గాల నుండి డబ్బు సంపాదించడానికి సహాయపడుతుంది. ఆరోగ్యానికి సంబంధించిన మంచి మార్పులు వస్తాయి. చాలా కాలంగా ఉద్యోగం మారాలని ఆలోచిస్తుంటే... రాహువు అనుగ్రహం కారణంగా, ఈ కాలంలో మీ కలలన్నీ నిజమవుతాయి. . ఈ కాలంలో తమ కుటుంబంతో మంచి సమయం గడపడానికి అవకాశం పొందుతారు.కొ ద్ది ప్రయత్నంతో సగటు వ్యక్తి సైతం సంపన్నులు కావడం జరుగుతుంది. ఈ కాలంలో రాజయోగాలు, రాజపూజ్యాలు ఎక్కువగా కలుగుతాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. విదేశాల నుంచి కూడా ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. విదేశీ ఉద్యోగాలు చేసుకుంటున్నవారు అక్కడే స్థిరపడే అవకాశం ఉంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
కుంభ రాశి : రాహువు శతభిషా నక్షత్రంలో సంచారము ఈ రాశిలో జన్మించిన వారికి గొప్ప ప్రయోజనాలను తెస్తుంది. అన్ని రంగాల్లో విజయం లభిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. వివాహం చేసుకోవాలనే కోరిక నెరవేరే అవకాశం ఉంది. రాహువు శుభ ప్రభావం కారణంగా, ఈ కాలంలో కొన్ని పెద్ద శుభవార్తలను పొందే అవకాశం ఉంది. ఈ కాలంలో అపారమైన ఆనందం , శ్రేయస్సును అనుభవిస్తారు. ఉద్యోగస్తులకు సీనియర్ల నుంచి కొత్త బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు పెద్ద ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశం ఉంది. పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆర్థికంగా ఇది బలపడే సమయం అవుతుంది.
