SS Rajamouli:వారాణసిలో ఒక్కో సీన్ గూస్ బంప్స్.. రాముడిగా మహేష్ బాబు రాజమౌళి ఎమోషనల్ స్పీచ్

SS Rajamouli:వారాణసిలో ఒక్కో సీన్ గూస్ బంప్స్.. రాముడిగా మహేష్ బాబు  రాజమౌళి ఎమోషనల్ స్పీచ్

దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) మేకింగ్ థాట్ వేరే. ఎవ్వరికీ అంత త్వరగా అంతు చిక్కదు. లైఫ్‌స్టైల్ అడ్వెంచర్, ఇతిహాస కథనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దానికి తోడు హ్యూమన్ ఎమోషన్స్ను కళ్ళకు కట్టినట్లుగా చూపించి వరుస విజయాలు అందుకుంటున్నారు. ఇపుడు మహేష్ బాబుతో తెరకెక్కించే సినిమాను ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు రాజమౌళి చాలా కష్టపడుతున్నారు. అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకునేలా అన్నీ సిద్ధం చేసుకుని.. చివరకు ఓ సంచారిలా మారి.. ఇవాళ (2025 నవంబర్15న) ప్రపంచ సినీ ఫ్యాన్స్ ముందుకొచ్చాడు. కథ, కథనం, మహేష్ పాత్ర, ఆహార్యం వంటి వివరాలు తన మాటల్లో చెప్పుకొచ్చాడు.

RRR వంటి ఆస్కార్ ఫిల్మ్ తర్వాత "వారాణసి"గా రాబోతున్న రాజమౌళి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ‘‘నన్ను, మహేష్ బాబుని కలిపినందుకు నిర్మాత కేఎల్ నారాయణకు థ్యాంక్స్. కొన్ని సినిమాలకు ముందే కథ చెప్పడం కుదురుతుంది. కొన్నింటికి కుదరదు. ఇలాంటి సినిమా కథను మాటల్లో చెప్పడం కుదరదు.

మహాభారతం తీయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడే రామాయణంలోని ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని అస్సలు అనుకోలేదు. ఈ సినిమా కోసం ఒక్కో సీన్ రాస్తుంటే గాల్లో ఉన్న ఫీలింగ్ కలిగింది. ఫస్ట్ డే మహేష్ బాబును రాముడి వేషం వేసి తీసుకొచ్చి ఫొటోషూట్ చేస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. ఆ ఫోటోను ఫోన్లో  వాల్ పేపర్గా కూడా పెట్టుకున్నా. కానీ ఎవరైనా చూస్తారేమో అని తీసేశా’’ అని జక్కన్న అన్నారు.

ఇక షూటింగ్  విషయాన్ని పంచుకుంటూ.. 'మహేష్ బాబు షూటింగ్కి వస్తే.. ఫోన్ ఏ మాత్రం పట్టుకోడు. ఎన్ని గంటలైనా సరే. షూటింగ్ అయ్యేంతవరకూ కార్లోనే పెట్టేస్తాడు. ఇది ప్రతిఒక్కరూ నేర్చుకోవాలి. నేను కూడా అలాగే చేసేందుకు ట్రై చేస్తా. అలాగే, దేవుడి మీద పెద్ద నమ్మకం లేదు. నాన్న వచ్చి హనుమ వెనకాల ఉంటాడు, నడిపిస్తాడని చెప్పారు’’ అని రాజమౌళి తన స్పీచ్ ద్వారా చెప్పుకొచ్చారు. 

సహజంగా రాజమౌళి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారంటే నాలుగు లేదా ఐదు సంవత్సరాల అయినా పడుతుందనే విషయం తెలిసిందే. అలానే ప్రభాస్ అతి ముఖ్యమైన తన ఐదేళ్ల కాలాన్ని బాహుబలి మూవీకి అంకితం చేసి వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందాడు. ప్రభాస్ ని ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలబెట్టాడు. ఇలా రాజమౌళి ఓ సినిమా తీశాడంటే..తనతో పాటు ఆ హీరోలను ప్రపంచస్థాయికి తీసుకెళ్తాడు. అయితే.. తెరకెక్కించే సినిమాలకు చాలా టైం వెచ్చిస్తాడని కూడా టాక్ ఉంది. ఇపుడు మహేష్తో తెరకెక్కిస్తున్న" వారణాసి"తో ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తాడో.. టైటిల్ గ్లింప్స్‌తో హింట్ ఇచ్చేశాడు. ఈ మూవీలో మహేష్ బాబు 'రుద్ర' గా కనిపిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ', ప్రియాంక చోప్రా 'మందాకినీ'గా నటిస్తున్నారు.