తాండూరు, వెలుగు: వికారాబాద్ జిల్లా పెద్దముల్ మండలం మదనంతపూర్ తండా, కొండాపూర్ గ్రామ శివారుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 50 ట్రాక్టర్ల ఇసుకను పోలీసులు, రెవెన్యూ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. అనుమతులు లేకుండా భారీగా ఇసుకను నిల్వ చేసినట్లు అందిన సమాచారంతో ఎస్సై ప్రశాంత్ వర్ధన్ నేతృత్వంలో ఈ దాడులు నిర్వహించారు. సీజ్ చేసిన ఇసుకను తదుపరి చర్యల కోసం రెవెన్యూ శాఖకు అప్పగించారు.
