ఒక్కరోజే పట్టుబడ్డ 17కేజీల బంగారం.. 75కేజీల వెండి

ఒక్కరోజే పట్టుబడ్డ 17కేజీల బంగారం.. 75కేజీల వెండి

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 500 కోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారు. నిన్న(నవంబర్ 05) ఒక్క రోజే నిజాంపేట్ లో 17 కేజీల బంగారం, 75 కేజీల వెండిని  సీజ్ చేశారు. తెలంగాణలోని పలు సరిహద్దు ప్రాంతాల్లో పోలీస్ అధికారులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 

సరైన పత్రాలు లేకుండా బంగారం, వెండి, నగదు, విలువైన వస్తువులు వంటివి తరలింపులపై నిఘా పెట్టారు అధికారులు. ఈ క్రమంలో సరిహద్దుల్లో తిరుగుతున్న వారందరి వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు, ఇన్నర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున డబ్బు, బంగారం, వెండి ఆభరణాలు, మద్యం బాటిళ్లు అదేవిధంగా ఓటర్లను ప్రలోభాలు గురి చేసే వస్తువులు పట్టుబడుతున్నాయని అధికారులు తెలిపారు.