లాక్​డౌన్ నుంచి కేంద్రం మరిన్ని మినహాయింపులు

లాక్​డౌన్ నుంచి కేంద్రం మరిన్ని మినహాయింపులు

ప్రకటించిన కేంద్ర హోం శాఖ

న్యూఢిల్లీ: కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా మే నెల 3 వరకు అమలులో ఉన్న లాక్​డౌన్ నుంచి కేంద్ర హోం శాఖ మరిన్ని మినహాయింపులు ఇచ్చింది. స్టూడెంట్లు పుస్తకాలు కొనుగోలు చేసుకునేందుకు వీలుగా.. పుస్తకాల దుకాణాలు, ఓల్డ్ ఏజ్ వాళ్లకు బెడ్ సైడ్ అటెండర్ల సేవలు, ఎలక్ట్రిక్ షాపులు, ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జి సదుపాయాలు వంటి ప్రజాసేవలు అందించే దుకాణాలను తెరిచి ఉంచేందుకు పర్మిషన్ ఇచ్చింది. టౌన్ లలోని బ్రెడ్ తయారీ ఫ్యాక్టరీలు, మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లు, పిండి మిల్లులు, వస్తువుల ఎగుమతి.. దిగుమతుల కోసం పని చేసే ప్యాకింగ్‌ హౌస్‌లు తెరిచేందుకు, అటవీ కార్యాలయాలు, అటవీ తోటలకు సంబంధిత కార్యకలాపాలు, వ్యవసాయ, ఉద్యానవన కార్యక్రమాలకు లాక్​డౌన్ పరిధి నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులలో తెలిపింది. దేశీయ నౌకాశ్రయాల మీదుగా నావికులు సముద్ర జలాల్లోకి వెళ్లి, రావడానికి పర్మిషన్ ఇస్తున్నట్లు పేర్కొంది. సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా మెయింటేన్ చేయాలని సూచించింది. అయితే ఈ కార్యకలాపాలు దేశంలోని కరోనా హాట్​స్పాట్​ లు మినహా మిగతా ప్రాంతాల్లో మాత్రమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.