ఎన్ఐఆర్‌‌డీలో 510 పోస్టులు

ఎన్ఐఆర్‌‌డీలో 510 పోస్టులు

గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనుకునే ఆసక్తి ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశం దొరికింది. హైద‌‌రాబాద్‌‌లోని నేష‌‌న‌‌ల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌‌ల్ డెవ‌‌ల‌‌ప్‌‌మెంట్​ అండ్ పంచాయ‌‌తీరాజ్‌‌(ఎన్ఐఆర్‌‌డీపీఆర్) స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేట‌‌ర్‌‌, యంగ్ ఫెలో, క్లస్టర్ లెవెల్ రిసోర్స్ ప‌‌ర్సన్ పోస్టుల భ‌‌ర్తీకి నోటిఫికేషన్​ రిలీజ్ ​చేసింది. దేశ‌‌‌‌వ్యాప్తంగా క్లస్టర్ మోడ‌‌‌‌ల్ గ్రామ‌‌‌‌పంచాయ‌‌‌‌తీలను అభివృద్ధి చేయడంలో భాగంగా భార‌‌‌‌త ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఎన్ఐఆర్‌‌‌‌డీపీఆర్ ఈ ఉద్యోగాల‌‌‌‌ను భ‌‌‌‌ర్తీ చేస్తోంది.

స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేట‌‌‌‌ర్‌‌‌‌

ఈ పోస్టులో ఎంపికైన వారు క్లస్టర్ మోడ‌‌‌‌ల్ గ్రామ‌‌‌‌ పంచాయ‌‌‌‌తీల ఏర్పాటులో భాగంగా ఎంపిక చేసిన గ్రామ‌‌‌‌పంచాయ‌‌‌‌తీల్లో జ‌‌‌‌రుగుతున్న ప‌‌‌‌నుల‌‌‌‌ను క్షేత్ర స్థాయిలో మానిట‌‌‌‌రింగ్ చేయాల్సి ఉంటుంది.

అర్హత‌‌‌‌: సోష‌‌‌‌ల్ సైన్సెస్‌‌‌‌లో పోస్టు గ్రాడ్యుయేష‌‌‌‌న్ డిగ్రీ (ఎక‌‌‌‌న‌‌‌‌మిక్స్‌‌‌‌/  రూర‌‌‌‌ల్ డెవ‌‌‌‌ల‌‌‌‌ప్‌‌‌‌మెంట్‌‌‌‌/  రూర‌‌‌‌ల్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌/  పొలిటిక‌‌‌‌ల్ సైన్స్‌‌‌‌/ ఆంథ్రపాల‌‌‌‌జీ/  సోష‌‌‌‌ల్‌‌‌‌వ‌‌‌‌ర్క్‌‌‌‌/  డెవ‌‌‌‌ల‌‌‌‌ప్‌‌‌‌మెంట్ స్టడీస్‌‌‌‌/ హిస్టరీ) ఉత్తీర్ణత‌‌‌‌తో పాటు క‌‌‌‌నీస అక‌‌‌‌డ‌‌‌‌మిక్ మెరిట్ (ప‌‌‌‌దోత‌‌‌‌ర‌‌‌‌గ‌‌‌‌తి నుంచి పీజీ వ‌‌‌‌ర‌‌‌‌కు) అవ‌‌‌‌స‌‌‌‌రం. ప‌‌‌‌దో త‌‌‌‌ర‌‌‌‌గ‌‌‌‌తిలో 60 శాతం, ఇంట‌‌‌‌ర్మీడియ‌‌‌‌ట్‌‌‌‌లో 50 శాతం, గ్రాడ్యుయేష‌‌‌‌న్‌‌‌‌లో 50 శాతం, పోస్టు గ్రాడ్యుయేష‌‌‌‌న్‌‌‌‌లో 50 శాతం మార్కులు ఉండాలి.

వ‌‌‌‌య‌‌‌‌సు: 1 నవంబర్​ 2020 నాటికి 30 నుంచి 50 ఏళ్ల మ‌‌‌‌ధ్య ఉండాలి. ఎస్సీ&ఎస్టీల‌‌‌‌కు ఐదేళ్లు, ఓబీసీల‌‌‌‌కు మూడేళ్లు స‌‌‌‌డ‌‌‌‌లింపు ఉంటుంది.

జీతభ‌‌‌‌త్యాలు: నెల‌‌‌‌కు రూ.55 వేలు ఉంటుంది. దీంతో పాటు ఎన్ఐఆర్‌‌‌‌డీపీఆర్ రూల్స్​ ప్రకారం ట్రావెలింగ్​, ఇతర అలవెన్స్​లు ఉంటాయి.

యంగ్ ఫెలో

క్షేత్రస్థాయిలో గ్రామ‌‌‌‌పంచాయ‌‌‌‌తీల‌‌‌‌కు వెళ్లి వివిధ శాఖ‌‌‌‌ల‌‌‌‌ అధికారులు, ప్రజాప్రతినిధుల‌‌‌‌తో క‌‌‌‌లిసి వారికి గ్రామ‌‌‌‌పంచాయ‌‌‌‌తీ ప‌‌‌‌నుల‌‌‌‌ను వివ‌‌‌‌రిస్తూ, వారితో క‌‌‌‌లిసి అభివృద్ధి ప‌‌‌‌నుల్లో పాల్గొనాల్సి ఉంటుంది.

అర్హత‌‌‌‌: సోష‌‌‌‌ల్ సైన్సెస్‌‌‌‌లో పోస్టు గ్రాడ్యుయేష‌‌‌‌న్ డిగ్రీ/ రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా(ఎక‌‌‌‌న‌‌‌‌మిక్స్‌‌‌‌/ రూర‌‌‌‌ల్ డెవ‌‌‌‌ల‌‌‌‌ప్‌‌‌‌మెంట్‌‌‌‌/ రూర‌‌‌‌ల్ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌/ పొలిటిక‌‌‌‌ల్ సైన్స్‌‌‌‌/ ఆంథ్రపాల‌‌‌‌జీ/ సోష‌‌‌‌ల్‌‌‌‌వ‌‌‌‌ర్క్‌‌‌‌/ డెవ‌‌‌‌ల‌‌‌‌ప్‌‌‌‌మెంట్ స్టడీస్‌‌‌‌/ హిస్టరీ) ఉత్తీర్ణత‌‌‌‌తో పాటు క‌‌‌‌నీస అక‌‌‌‌డ‌‌‌‌మిక్ మెరిట్ (ప‌‌‌‌దోత‌‌‌‌ర‌‌‌‌గ‌‌‌‌తి నుంచి పీజీ వ‌‌‌‌ర‌‌‌‌కు) కూడా అవ‌‌‌‌స‌‌‌‌రం. ప‌‌‌‌దో త‌‌‌‌ర‌‌‌‌గ‌‌‌‌తిలో 60 శాతం, ఇంట‌‌‌‌ర్మీడియ‌‌‌‌ట్‌‌‌‌లో 50 శాతం, గ్రాడ్యుయేష‌‌‌‌న్‌‌‌‌లో 50 శాతం, పోస్టు గ్రాడ్యుయేష‌‌‌‌న్‌‌‌‌లో 50 శాతం మార్కులు ఉండాలి.

వ‌‌‌‌య‌‌‌‌సు: 1 నవంబర్​ 2020 నాటికి 21-–30 ఏళ్ల మ‌‌‌‌ధ్య ఉండాలి.ఎస్సీ & ఎస్టీల‌‌‌‌కు ఐదేళ్లు, ఓబీసీల‌‌‌‌కు మూడేళ్లు స‌‌‌‌డ‌‌‌‌లింపు ఉంటుంది.

జీతభ‌‌‌‌త్యాలు: నెల‌‌‌‌కు రూ.35 వేలు ఉంటుంది. దీంతో పాటు ఎన్ఐఆర్‌‌‌‌డీపీఆర్ రూల్స్​  ప్రకారం ట్రావెలింగ్​, ఇతర అలవెన్స్​లు ఉంటాయి.

క్లస్టర్ లెవెల్ రిసోర్స్ ప‌‌‌‌ర్సన్‌‌‌‌

ఈ పోస్టులో ఎంపికైన వారు వార్డు స్థాయిలో ప్రజల్ని గ్రామపంచాయ‌‌‌‌తీ విధుల్లో (గ్రామ ‌‌‌‌స‌‌‌‌భ‌‌‌‌, వార్డ్ స‌‌‌‌భ‌‌‌‌, మ‌‌‌‌హిళా స‌‌‌‌భ‌‌‌‌)పాల్గొనేలా చైత‌‌‌‌న్యవంతుల్ని చేయాలి.

అర్హత‌‌‌‌: ఇంట‌‌‌‌ర్మీడియ‌‌‌‌ట్ ఉత్తీర్ణత‌‌‌‌తోపాటు సెల్ప్ హెల్ప్ గ్రూప్స్‌‌‌‌లో ప‌‌‌‌ని చేసిన అనుభ‌‌‌‌వం/ సెల్ప్ హెల్ప్ గ్రూప్స్ లీడర్‌‌‌‌గా ప‌‌‌‌ని చేసి ఉండ‌‌‌‌డం/ ఎన్ఐఆర్‌‌‌‌డీపీఆర్‌‌‌‌/ ఎన్ఆర్ఎల్ఎం/ ఎస్ఆర్ఎల్ఎం నుంచి సంబంధిత స‌‌‌‌ర్టిఫికెట్ ప్రోగ్రామ్స్​ చేసి ఉండాలి.

వ‌‌‌‌య‌‌‌‌సు: 1 నవంబర్​ 2020 నాటికి 25-–40 ఏళ్ల మ‌‌‌‌ధ్య ఉండాలి. ఎస్సీ & ఎస్టీల‌‌‌‌కు ఐదేళ్లు, ఓబీసీల‌‌‌‌కు మూడేళ్లు స‌‌‌‌డ‌‌‌‌లింపు ఉంటుంది.

జీతభ‌‌‌‌త్యాలు: నెల‌‌‌‌కు రూ.12,500 ఉంటుంది. దీంతో పాటు ఎన్ఐఆర్‌‌‌‌డీపీఆర్ రూల్స్​ ప్రకారం ట్రావెలింగ్​, ఇతర అలవెన్స్​లు ఉంటాయి.

రిక్రూట్​మెంట్​ విధానం: ఇవి పూర్తిగా కాంట్రాక్టు పోస్టులు. ఏడాది కాంట్రాక్టు ఉంటుంది. అభ్యర్థి పనితీరు నచ్చితే కాంట్రాక్టు కాలపరిమితి పొడిగించవచ్చు.

మోడల్​ జీపీ క్లస్టర్స్​ ప్రాజెక్ట్​కు ఎంపికైన తెలంగాణ జిల్లాలు:  ఖమ్మం, మహబూబ్​నగర్​, వరంగల్​ రూరల్​, కుమ్రంభీం ఆసిఫాబాద్​, జయశంకర్​భూపాలపల్లి మొత్తం అయిదు జిల్లాలు

పోస్టుల రిజర్వేషన్లు: ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం