ఘోర అగ్ని ప్రమాదం.. 52 మంది సజీవ దహనం

ఘోర అగ్ని ప్రమాదం.. 52 మంది సజీవ దహనం

 సౌతాఫ్రికాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.  సెంట్రల్ జోహన్నెస్‌బర్గ్‌లోని ఐదు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి.  ఈ ప్రమాదంలో  52 మంది మృతి చెందారు. మరో 43 మందికి స్వల్ప గాయాలయ్యాయని ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రతినిధి రాబర్ట్ ములాడ్జీ తెలిపారు. 

ఆగస్టు 31న  తెల్లవారుజామున  అపార్ట్ మెంట్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.  ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి.  అయితే దట్టమైన పొగ కమ్మేయడంతో సహాయక చర్యలుకు ఇబ్బంది తలెత్తుతోంది.   ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.