ఆగ‌స్ట్ 30 వ‌ర‌కు 52 రైలు స‌ర్వీసులు ర‌ద్దు..

ఆగ‌స్ట్ 30 వ‌ర‌కు 52 రైలు స‌ర్వీసులు ర‌ద్దు..

రైల్వే ట్రాక్​ అభివృద్ధి, మరమ్మతుల పనుల కారణంగా విజయవాడ డివిజన్​లోని పలు రైలు సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ట్రాఫిక్ కం పవర్​బ్లాక్​, విజయవాడ – గుణదల మధ్య మూడో లైన్​ ప్రారంభం, ప్రీ ఇంటర్​లాకింగ్, ఇంటర్​లాకింగ్​ పనుల కారణంగా విజయవాడ నుంచి విశాఖపట్నానికి, ఇతర మార్గాల్లో నడిచే ఎక్స్​ప్రెస్, సూపర్​ఫాస్ట్, స్పెషల్​ ట్రైన్స్​తో సహా మొత్తం 52 రైళ్లు క్యాన్సల్​ అయినట్లు వారు వివరించారు. 

ఆగస్టు 23 నుంచి 29, 30 తేదీల వరకు ఆయా మార్గాల్లో ట్రైన్స్​అందుబాటులో ఉండవని చెప్పారు. తిరుమల ఎక్స్​ప్రెస్, గరీబ్​రథ్​ ఎక్స్​ప్రెస్, కటక్​– హైదరాబాద్ స్పెషల్​ ఎక్స్​ప్రెస్, జన్మభూమి ఎక్స్​ప్రెస్, సికింద్రాబాద్​– విశాఖపట్నం ఏసీ ఎక్స్​ప్రెస్, డబుల్​డెక్కర్, ఉదయ్​ఎక్స్​ప్రెస్, తిరుపతి స్పెషల్, రత్నాచల్, సింహాద్రి రద్దైన ట్రైన్స్​లిస్టులో ఉన్నాయి. 

విజయవాడ రూట్లో క్యాన్సల్​ అయిన రైళ్ల వివరాలివే.. విజయవాడ – రాజమండ్రి, విజయవాడ – కాకినాడ, కాకినాడ – లింగంపల్లి, విజయవాడ – మచిలీపట్నం, ధర్మవరం – విజయవాడ, కాకినాడ – తిరుపతితో పాటు మరికొన్ని ట్రైన్స్​ క్యాన్సల్​ అయిన లిస్ట్​లో ఉన్నాయి.  రద్దైన ట్రైన్ల వివరాల కోసం రైల్వే శాఖ అఫిషియల్​ వెబ్ సైట్ ని చూడాలని అధికారులు వివరించారు.