హైదరాబాద్ సిటీలో 54 మంది సీఐలు బదిలీ

హైదరాబాద్ సిటీలో 54 మంది సీఐలు బదిలీ

పోలీస్ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. హైదరాబాద్ నగరంలో 54 మంది సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో ముఖ్యంగా సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ నుంచి పెద్దమొత్తంలో సీఐలు ఇతర డిపార్ట్ మెంట్ లకు బదిలీ అయ్యారు.  మరో 26 మంది సీఐల బదిలీలు పెండింగ్ లో ఉన్నాయని..  వారిని సీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయమని  హైదరాబాద్  సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఏడాది జనవరి 7న 20 మంది ఐపీఎస్‌‌‌‌‌‌‌‌లను బదిలీ చేసి, పోస్టింగ్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. జనవరి 17న మరో 20 మంది ఐపీఎస్‌‌‌‌‌‌‌‌ల బదిలీలు జరిగాయి.  హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న ఎస్పీలు, డీసీపీలను ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి పోస్టింగ్ ఇస్తూ  సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కమిషనరేట్ల పునర్విభజనలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, సైబరాబాద్‌‌‌‌‌‌‌‌, మల్కాజిగిరి, ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌ సిటీ కమిషనరేట్‌‌‌‌‌‌‌‌లలో కొత్తగా ఏర్పడిన జోన్లకు అధికారులను కేటాయించారు. కొత్తగా ఏర్పాటైన జోన్లలో ట్రాఫిక్, అడ్మిన్‌‌‌‌‌‌‌‌ డీసీపీలను నియమించారు. ఇపుడు  సీఐలు బదిలీలు జరిగాయి. 

►ALSO READ | జమ్మికుంట రైల్వే స్టేషన్ లో అయోమయం..రైళ్ల రాకపోకల డిస్ ప్లే బోర్డు ప్రదర్శనలో గందరగోళం