హైదరాబాద్ కేబీఆర్ పార్కులో 565 నెమళ్లు

హైదరాబాద్ కేబీఆర్ పార్కులో 565 నెమళ్లు

తెలంగాణ ఫారెస్ట్ నిర్వహించిన నెమళ్ల గణనలో బంజారాహిల్స్‌లోని  కాసు బ్రహ్మానంద రెడ్డి(కేబీఆర్) పార్క్‌లో   565  ఆడ, మొగ నెమళ్లు ఉన్నట్టుగా అటవీ శాఖాధికారులు గుర్తించారు.  2023  నవంబర్ 19వ తేదీన   నెమళ్ల గణన చేపట్టి లెక్క తేల్చారు. ములుగు అటవీకళాశాల విద్యార్థులు, స్నేక్ సొసైటీ, డబ్ల్యూడబ్ల్యూఎఫ్, డెక్కన్ బర్డ్స్, ఎన్జీఓలు సహాయంతో గణన ప్రక్రియను పూర్తి చేశారు పార్కు అధికారులు.  

390 ఎకరాల్లో ఉద్యానం విస్తరించి ఉంది. నెమళ్లతో పాటు వివిధ రకాల జాతుల పక్షులను గుర్తించి లెక్కించామని అధికారులు తెలిపారు. ఈ  కార్యక్రమంలోసీఎఫ్ చార్మినార్ సైదులు, డీఎఫ్‌వో హైదరాబాద్‌ ఎం జోజీ, ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి, కేబీఆర్‌ పార్క్‌ సిబ్బంది పాల్గొన్నారు.  డిసెంబర్‌ 3న కేబీఆర్‌ పార్కు వార్షికోత్సవం సందర్భంగా అధికారులుల లెక్కలు చేపట్టారు.