5,895 కుటుంబాలు నిరాశ్రులయ్యాయి

5,895 కుటుంబాలు నిరాశ్రులయ్యాయి

ఐదారు రోజలుగా విడవకుండా పడుతున్న వానలతో తెలంగాణ వ్యాప్తంగా 5,895 ఇండ్లు ధ్వంసం కాగా.. ఆయా కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. 246 ఇండ్లు పూర్తిగా కూలిపోయాయి. గూడు చెదిరిన బాధితుల్లో కొంతమంది బంధువుల ఇండ్లలో తలదాచుకుంటుండగా.. మరికొందరు పునరావాస కేంద్రాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా 955 ఇండ్లు దెబ్బతినగా, ఇందులో 51 పూర్తిగా నేలమట్టమయ్యాయి. సిద్దిపేట జిల్లాలో 538, కామారెడ్డి జిల్లాలో 480, నిజామాబాద్​ జిల్లాలో 470, కరీంనగర్ జిల్లాలో  375  ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఇండ్లు, గోడలు కూలిన ఘటనల్లో నల్గొండ జిల్లాలో ఇద్దరు, సిద్దిపేట, జనగామ జిల్లాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు.