
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలోని నెహ్రూ జూలాజికల్పార్కుకు వరుసగా ఐదోసారి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ 9001:2015 గుర్తింపు పొందినట్లు జూపార్క్ డైరెక్టర్ సునీల్ హిరేమత్ వెల్లడించారు.మెరుగైన నిర్వహణ, ప్రణాళికబద్ధమైన సంతానోత్పత్తి, వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి ఐఎస్ఓ టీమ్ తనిఖీ చేసి సర్టిఫికెట్ జారీ చేసిందని తెలిపారు. గురువారం హెచ్ వైఎం, ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ప్రైవేట్ లిమిటెడ్డైరెక్టర్ఎ.శివయ్య, జూపార్క్ డైరెక్టర్సునీల్హిరేమత్ ఆధ్వర్యంలోని బృందానికి 204–2025 ఏడాదికి సంబంధించిన ఐఎస్ఓ సర్టిఫికెట్ను అందజేశారు. ఈ సందర్భంగా జూపార్క్ క్యూరేటర్జె.వసంత మాట్లాడుతూ... దేశంలో అంతరించి పోతున్న జాతుల నిర్వహణ, ప్రణాళిక బద్ధమైన సంతానోత్పత్తిలో మెరుగైన సేవలు అందిస్తుంది ఒక్క నెహ్రూ జూపార్క్మాత్రమేనని తెలిపారు.