
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాగ్‌రాజ్-లక్నో రహాదారిపై ట్రక్కును ఓ జీపు ఢీ కొనడంతో 14 మంది మృతిచెందారు. చనిపోయిన వారిలో ఆరుగురు చిన్నారులున్నారు. ప్రయాగ్‌రాజ్-లక్నో హైవేపై వెళ్తున్న జీవు ప్రతాప్‌గఢ్ సమీపంలో ట్రక్కును ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 14 మంది చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు…గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.