రెండు బస్సులు ఢీ .. అక్కడిక్కడే ఆరుగురు దుర్మరణం

రెండు బస్సులు ఢీ .. అక్కడిక్కడే ఆరుగురు దుర్మరణం

ఉత్తరప్రదేశల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం  లక్నో-హర్దోయ్ రోడ్డులో ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు డీ కొన్నాయి. ఈ  ఘటనలో ఒక బస్సు డ్రైవర్ తో పాటు  ఆరుగురు మృతి చెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఒక బ‌స్సు ల‌క్నో నుంచి హ‌ర్దోయ్‌కి వెళ్తుండ‌గా.. మ‌రో బ‌స్సు హ‌ర్దోయ్ నుంచి ల‌క్నో వ‌స్తుండగా  ఢీ కొన్నాయ‌ని లక్నో లాం అండ్ ఆర్డర్   జాయింట్ కమిషనర్ నవీన్ అరోరా  చెప్పారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.

అలాగే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా స్పందించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.