ఆరు అంతస్తుల అపార్ట్ మెంట్.. నిట్టనిలువునా కూలింది

ఆరు అంతస్తుల అపార్ట్ మెంట్.. నిట్టనిలువునా కూలింది

అమెరికాలో ఓ భవనం పేకమేడలా కూలిపోయింది. తూర్పు అయోవా నగరంలో డావెన్ పోర్టులో మే28 ఆదివారం సాయంత్రం ఆరు అంతస్తుల అపార్ట్ మెంట్ కుప్పకూలింది. ఈ ప్రమాదం వల్ల వందల మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే బిల్డింగ్ కూలిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 5గంటలకు భారీ బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే సమాచారం అందుకున్న  అగ్ని మాపక సిబ్బంది, ఇతర సహాయక సిబ్బంది ఏడుగురిని రక్షించారు. వారికి గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం ప్రత్యేక రెస్య్కూ బృందాలు సహాయం చర్యలు కొనసాగిస్తున్నాయి. బిల్డింగ్ కుప్పకూలిన తరువాత గ్యాస్ లీక్ అయినట్లు అధికారులు కనుగొన్నారు. పనులు జరుగుతున్న అంతస్తులలో నీరు కూడా లీక్ అయ్యిందని చెప్పారు. దీంతో భవనానికి సరఫరా అయ్యే గ్యాస్, నీటి పైప్ లైన్లను అధికారులు మూసివేశారు. 

నా పిల్లలు లోపలే ఉన్నారు..

ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాలు నా పై పడబోయాయి. నేను కొద్దిగా తప్పిచుకోగలిగాను. కానీ నా భార్య, పిల్లలు లోపలే ఉండిపోయారు..వారు ఎలా ఉన్నారని ఆందోళనగా ఉంది..అని అపార్ట్ మెంట్ లో అద్దెకు ఉంటున్న ఓ వ్యక్తి తెలిపాడు.