ఆకలితో 60 మంది చిన్నారులు మృతి

ఆకలితో 60 మంది చిన్నారులు మృతి
  • ఆర్మీ, పారామిలిటరీ పోరు వల్ల పిల్లలకు పాలు కూడా దొర్కుతలే 

ఖర్టూమ్‌‌‌‌‌‌‌‌ (సూడాన్‌‌‌‌‌‌‌‌): సూడాన్‌‌‌‌‌‌‌‌లో ఆర్మీకి, పారామిలటరీ దళాలకు మధ్య జరుగుతున్న యుద్ధంలో పసి పిల్లలు కూడా బలైపోతున్నారు. యుద్ధం వల్ల ఆహార సంక్షోభంతో పాలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో రెండు నెలల్లోనే 60 మంది చిన్నారులు మృతి చెందారు. గత వారం రెండ్రోజుల్లోనే 26 మంది పిల్లలు చనిపోయినట్లు వెల్లడైంది. దేశ రాజధాని ఖర్టూమ్‌‌‌‌‌‌‌‌లోని ఒక అనాథాశ్రమంలోని చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉంది. పసి పిల్లలకు పట్టడానికి పాలు, తినిపించడానికి ఫుడ్‌‌‌‌‌‌‌‌ లేక ఆకలి తీర్చేందుకు నీళ్లను తాగిస్తున్నారు.

దీంతో చాలా మంది పిల్లలు ఆకలికి తట్టుకోలేక, అనారోగ్యం బారిన పడి మరణిస్తున్నారు. చనిపోయిన శిశువుల డెడ్‌‌‌‌‌‌‌‌బాడీలను వైట్‌‌‌‌‌‌‌‌ షీట్‌‌‌‌‌‌‌‌లో చుట్టి పూడ్చడానికి సిద్ధంగా ఉంచడం.. చంటిపిల్లలు ఏడుస్తూ ఉండగా, మహిళా వాలంటీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నీళ్లను తాగిస్తుండటం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో యునిసెఫ్‌‌‌‌‌‌‌‌, రెడ్‌‌‌‌‌‌‌‌క్రాస్‌‌‌‌‌‌‌‌ సాయంతో స్థానిక స్వచ్ఛంద సంస్థ మే 28న అనాథాశ్రమానికి ఫుడ్‌‌‌‌‌‌‌‌, మెడిసిన్స్‌‌‌‌‌‌‌‌ అందించింది. కాగా, సూడాన్‌‌‌‌‌‌‌‌లో ఇప్పటిదాకా 860 మంది చనిపోగా, వీరిలో 190 మంది చిన్నారులే ఉన్నారు.