
ఖమ్మం జిల్లాలో పొలాల్లో మేతకు వెళ్లిన 65 మేకలు అకస్మాత్తుగా చనిపోయాయి. ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడు తండాలో ఆదివారం (మే25) బెండతోటలో మేతకు వెళ్లిన 300 మేకలు..ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. చేనేలోనే సుమారు 50 మేకలు చనిపోగా.. ఖమ్మంలోని జిల్లా పశువైద్యశాలలో 15 మేకలు చనిపోయాయి. మరో 50 మేకలకు చికిత్స అందిస్తున్నారు.
బెండకాయ పొలంలో రసాయనక మందులు పిచికారి చేయడం వల్ల అవి తిన్న మేకలు చనిపోయి ఉంటాయని రైతులు అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 55 మేకలు చనిపోయాయని ఇంకా పొలంలో సైతం చెట్లల్లో చనిపోయిన మేకలు కనిపిస్తున్నాయని హాస్పిటల్లో సైతం చాలావరకు మేకలు అస్వస్థత గురయ్యాయని స్థానికులు చెబుతున్నారు.
ALSO READ | ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అవతారం..ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామని మోసం..సూడో పోలీస్ అరెస్ట్
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెర్వుకు చెందిన రైతు బెండకాయ పంట వేశాడు. పంటకూడా చేతికి వచ్చింది కోత కోశాం.. మేకలకు మేత మేపుకోవచ్చని సమీప మేకల యజమానులకు తెలపగా.. వారు ఆదివారం బెండతోటలో మేకలు మేపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 300 మేకలు మేతకు వెళ్లాయి. మేత మేసిన అర్థగంటలోనే మేకలు చనిపోవడం మొదలుపెట్టాయి. పొలంలోనే 50 మేకలు చనిపోయాయి. మిగతా మేకలను ఖమ్మం పశువైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ మరో 15 మేకలు చనిపోయాయి. ఇంకా మేకలు చనిపోయే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు.
మేతకు వెళ్లిన మేకలు చనిపోవడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బెండతోటకు వారం రోజులక్రితం క్రిమీ సంహారక మందులు కొట్టామని చెబుతున్నారు.. అయితే మందులు కొట్టి రెండు మూడు రోజులే అయివుంటుంది.. దీంతో కెమికల్స్ ప్రభావం మేకలపై చూపిందని, అందుకు మేకలు మృతిచెంది ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు.