హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి.. 48 గంటల్లో 60 మంది చనిపోయారు..

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి.. 48 గంటల్లో 60 మంది చనిపోయారు..

ఉత్తరభారతంలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు ఉప్పొంగుతున్నాయి.ఢిల్లీలోని యమునది నీటిమట్టాలు ప్రమాద కర స్థాయికి హిమాచల్ ప్రదేశ్ లో డ్యాం పొంగిపొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాలు, గ్రామాలను వరదలు ముంచెత్తాయి. కాంగ్రాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దాదాపు 100 మంది వరదల్లో చిక్కుకుని ఉన్నారు. వారిని రక్షించేందుకు హిమాచల్ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. 
హిమాచల్లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి రోడ్లు బ్లాక్ అయ్యాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో శిథిలాల కిందనుంచి పౌరులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 60మందికి పైగా మృతిచెందాయి. 
హిమాచల్ ప్రదేశ్ లో వచ్చే రెండో రోజులు, ఉత్తరాఖండ్ లో మరో నాలుగు రోజులు పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనావేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. 
కాంగ్రాలో డ్యాం పొంగిపొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరద బాధితులను ఆదుకునేందుకు కాంగ్రా వెళ్తున్నట్లు హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు చెప్పారు. గత కొన్ని రోజులు కురుస్తున్న వర్షాలతో రాష్ట్రానికి దాదాపు 10వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని సుఖ్వీందర్ సుఖు వెల్లడించారు. రాష్ట్ర మౌలిక సదుపాయాలను పునరుద్దరణకు దాదాపు సంవత్సర కాలం పడుతుందని అంచనా వేశారు.