సైన్ బోర్డ్స్ లో 60 శాతం కన్నడ ఉండాలి

సైన్ బోర్డ్స్ లో 60 శాతం కన్నడ ఉండాలి

బెంగళూరు: దుకాణాలు తమ సైన్ బోర్డుల్లో 60 శాతం కన్నడ ఉండేలా చూసుకోవాలని బృహత్ బెంగళూరు మహానగర పాలికె ఆదేశాలు జారీ చేసింది. బెంగళూరు పురపాలక సంఘం పరిధిలోని షాపులన్నీ ఈ ఆదేశాలు తప్పకుండా పాటించాలని తెలిపింది. కర్నాటక రక్షణ వేదిక నిర్వహించిన కార్యక్రమంలో చీఫ్​ కమిషనర్ తుషార్ గిరి నాథ్ మాట్లాడుతూ.. ‘‘బెంగళూరు నగరంలో 1400కిమీల రహదార్లు ఉన్నాయి. ఈ రోడ్లపై ఉన్న దుకాణాలను జోన్ వైజ్ గా సర్వే చేస్తాం. ఆ తర్వాత సైన్ బోర్డ్స్ లో 60 శాతం కన్నడ ఉపయోగించని షాపులకు నోటీసులు జారీ చేస్తాం. నేమ్ ప్లేట్స్ లో కన్నడ భాషను అమలు చేయడానికి ఫిబ్రవరి 28 వరకు గడువిస్తాం. అప్పటి కూడా నేమ్ ప్లేట్స్ కన్నడలో పెట్టకపోతే వారిపై చర్యలు తీసుకుంటాం. లైసెన్స్ ను రద్దు చేస్తాం” అని పేర్కొన్నారు.