
హార్ట్ అటాక్..గుండెపోటు ఈ పదాలు వింటేనే జనం వణికిపోతున్నారు.. ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుందోని భయాందోళనకు గురవుతున్నారు..గతంలో 45 యేళ్లు పైబడిని వారికే గుండెపోటు వస్తుందనే టాక్ ఉంది. కానీ ఇటీవల కాలంలో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల వారిని గుండెపోటు వేధిస్తోంది. కూర్చున్నవారు కూర్చునట్టుగానే.. ఆడుతూనే.. పాడుతూనే.. డ్రైవింగ్ చేస్తూ కొందరు.. స్నాం చేస్తూ కొందరు.. ఇలా గుండెపోటు వార్త లేని రోజంటూ లేదు.. ఇలాంటి సందర్భాల్లో సీపీఆర్ అనేది కొందరి ప్రాణాలు రక్షిస్తోందని చెప్పొచ్చు..తాజాగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఓ వృద్ధుడు హార్ట్ అటాక్ తో కుప్పకూలిపోగా.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడింది ఓ డాక్టరమ్మా.. వివరాల్లోకి వెళితే..
గురువారం(జూలై18, 2024) న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో విమానం కోసం ఎదురు చూస్తున్న ఓ వృద్ధుడు .. ఒక్కసారిగా కూర్చున్నవాడు కూర్చున్నట్టుగానే కూలిపోయాడు. హార్ట్ అటాక్ వచ్చిందని అక్కడున్నవారు గమనించారు.. వెంటనే అక్కడే ఉన్న ఓ లేడీ డాక్టర్ స్పందించి సీపీఆర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ లేడీ డాక్టర్ దాదాపు నాలుగు నిమిషాల పాటు సీపీఆర్ చేయడం ఆ పెద్దాయన ఊపిరి పీల్చుకున్నాడు.. ప్రాణాపాయ స్థితినుంచి బయటపడ్డాడు.. అక్కడున్న వారంతా ఆ లేడీ డాక్టర్ కు అభినందించారు. సమయానికి సీపీఆర్ చేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడినందుకు నెటిజన్లు లేడీ డాక్టర్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రతి ఒక్కరికి సీపీఆర్ చేయడంలో శిక్షణ ఇస్తే.. గుండెపోటునుంచి కొంతమందినైనా రక్షించవచ్చంటున్నారు నెటిజన్లు.
ఢిల్లీ ఎయిర్పోర్ట్లో గుండెపోటుతో కుప్పకూలిన 60 ఏళ్ల పెద్దమనిషికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్. pic.twitter.com/blhKw9CBAP
— Telugu Scribe (@TeluguScribe) July 17, 2024