
హైదరాబాద్, వెలుగు: ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఎలక్షన్ అబ్జర్వర్లు గురువారం పరిశీలించారు. స్పెషల్ అబ్జర్వర్, రిటైర్డ్ ఐపీఎస్ దీపక్ మిశ్రా, రిటైర్డ్ ఐఏఎస్ అజయ్ వినాయక్ టీఎస్ ఐసీసీసీ టవర్స్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించారు. సీపీ సందీప్ శాండిల్యతో కలిసి మానిటరింగ్ చేశారు. 6వేల సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో అనుసంధానం చేసిన పోలింగ్ స్టేషన్స్ లోపల, బయటి పరిస్థితులను బిగ్ స్క్రీన్‌పై పరిశీలించారు.
ఈ క్రమంలోనే సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలోని కమాండ్ కంట్రోల్ సెంటర్స్‌ను మానిటరింగ్ చేశారు. సీపీ సందీప్ శాండిల్య, స్టీఫెన్ రవీంద్ర, డీఎస్ చౌహన్ స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు సేకరించారు. ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు పటిష్టమైన నిఘా పెట్టారు. పోలింగ్ స్టేషన్స్ నుంచి ఈవీఎంలను కేంద్ర బలగాల బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్స్‌కి తరలించారు.