రూ.50 కోట్లు ఇవ్వనున్న సెంట్రల్​ గవర్నమెంట్​

రూ.50 కోట్లు ఇవ్వనున్న సెంట్రల్​ గవర్నమెంట్​
  • ప్రతిపాదనలు రూపొందించిన అధికారులు
  • కేంద్రం నుంచి రూ.50 కోట్లు, రాష్ట్రం నుంచి రూ.11 కోట్లు  
  • డిసెంబర్​లో మళ్లీ రానున్న యునెస్కో ప్రతినిధులు

జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి / వెంకటాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: యునెస్కో గుర్తింపు వచ్చిన ఏడాది తర్వాత రామప్ప గుడి అభివృద్ధిపై గురువారం తొలిసారిగా సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున రామప్ప డెవలప్ మెంట్​కోసం రూ.61 కోట్లు కేటాయిస్తూ ప్రతిపాదనలు తయారు చేశారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆధ్వర్యంలో ములుగు జిల్లా కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాలంపేట అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఇందులో యునెస్కో గుర్తింపు సందర్భంగా ఆ కమిటీ ఇచ్చిన నివేదికలోని 8 అంశాలపై చర్చ జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృష్ణ ఆదిత్యతో పాటు కేంద్ర పర్యాటక శాఖ ఆఫీసర్లు స్మిత ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమారి, నారాయణ, కాకతీయ హెరిటేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రతినిధి పాండు రంగారావుతో పాటు, ములుగు ఎమ్మెల్యే సీతక్క, నీటి పారుదల శాఖ ఆఫీసర్లు పాల్గొన్నారు. అంతకంటే ముందు సందీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుల్తానియా రామప్ప టెంపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విజిట్​చేసి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఆలయ పరిసరాలను పరిశీలించారు. 

డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రానున్న యునెస్కో ప్రతినిధులు 
రామప్ప టెంపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు యునెస్కో గుర్తింపు పత్రం ఇచ్చేందుకు వచ్చే డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెలలో యునెస్కో టీం రామప్పకు రానుందని ములుగు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృష్ణ ఆదిత్య తెలిపారు. అప్పటిలోగా వారిచ్చిన 8 అంశాలపై డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడీ చేసి యునెస్కోకు పంపిస్తామన్నారు. కాకతీయ హెరిటేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రతినిధి పాండురంగారావు మాట్లాడుతూ యునెస్కో సూచనల ప్రకారం తమ సంస్థ ఆధ్వర్యంలో 50 మంది యునెస్కో వలంటీర్ల బృందాన్ని రెడీ చేస్తున్నట్లు ప్రకటించారు. వీరిలో 10 మంది అంతర్జాతీయ స్థాయి వలంటీర్లను యునెస్కో గుర్తించి పంపిస్తుందని, మిగిలిన 40 మందిని మన దేశంలోని హెరిటేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆర్కియాలజీ డిపార్టెమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్ల నుంచి తీసుకుంటామన్నారు. వీరికి వచ్చే సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 19 వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రామప్పలో శిక్షణ ఉంటుందన్నారు. రామప్ప టెంపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు యునెస్కో గుర్తింపు రావడానికి కాకతీయ హెరిటేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరపున 15 ఏండ్ల పాటు పనిచేసి డోసియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారు చేయడం, ప్యారిస్​వెళ్లి యునెస్కో ప్రతినిధులను కలవడం వంటివి చేయడం వల్ల తమ సంస్థకు ఈ అవకాశం కల్పించారన్నారు.

యునెస్కో ఇచ్చిన 8 అంశాలపై సమీక్ష
రామప్ప ఆలయానికి జులై 25, 2021న యునెస్కో గుర్తింపు వచ్చింది. ఈ సందర్భంగా యునెస్కో ప్రతినిధులు రామప్ప అభివృద్ధి కమిటీ నియామకంతో పాటు మరికొన్ని అంశాలపై సమీక్ష చేసి నివేదిక అందజేయాలని షరతు విధించింది. డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1, 2022 వరకు గడువు విధించింది. యునెస్కో గుర్తింపు వచ్చిన నెల రోజుల లోపు కమిటీ వేయాల్సి ఉండగా 11 నెలలు ఆలస్యం చేసి నెల రోజుల క్రితం పాలంపేట అభివృద్ధి కమిటీకి ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా నియామకం తర్వాత ఆయన గురువారం టెంపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సందర్శించి రివ్యూ నిర్వహించారు.

ప్రసాద్​ స్కీం కింద రూ.50 కోట్లు ఇవ్వనున్న సెంట్రల్​ గవర్నమెంట్​
టెంపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభివృద్ధి కోసం సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కీంలో భాగంగా రూ.50 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.11 కోట్లతో ప్రపోజల్స్​రెడీ చేసినట్టు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ప్రకటించారు. ఆలయ పరిసరాలను 100, 300 , 500 మీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలను గుర్తించి మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని ఆదేశించారు. అలాగే సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్కియాలజీ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో జరుగుతున్న కామేశ్వరాలయం పునరుద్ధరణ పనులు, గొల్లగుడి, శివుని గుడి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. అలాగే రామప్ప లేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్టపై ఉన్న శివాలయంతో పాటు 4 రామప్ప అనుబంధ ఆలయాలను రూ.9.5 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. రామప్ప గుడి తూర్పు ముఖద్వారం వైపు రూ.1.82 కోట్లతో నిర్మించిన రోడ్డు వరదలకు కొట్టుకుపోతుండటంతో మరో రూ.3 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో బాగు చేస్తామన్నారు. ఈ నెల 13న నిర్వహించాల్సిన కాకతీయ ఉత్సవాలు వర్షాల వల్ల వాయిదా పడడంతో సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో జరగనున్న వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టూరిజం డే రోజు నిర్వహిస్తామని ప్రకటించారు.