62.99 లక్షల మందికి రైతుబంధు

62.99 లక్షల మందికి రైతుబంధు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఇప్పటి వరకు కోటి 48లక్షల ఎకరాలకు రైతుబంధు అందించినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. రాష్ట్రవాప్తంగా ఉన్న  రైతుల్లో 62.99 లక్షల మంది అకౌంట్లలోకి రూ.7411.52 కోట్లు జమ చేశారు. వ్యవసాయశాఖ వివరాల ప్రకారం ఈ యాసంగిలో కోటి 52 లక్షల 91వేల ఎకరాల పట్టా భూమి ఉన్న 66.61 లక్షల మంది రైతులకు రూ.7645.66 కోట్లు రైతుబంధు సాయం అందాల్సి ఉంది. డిసెంబరు 28 నుంచి రైతుబంధు పంపిణీ షురూ అయింది. జనవరి 20వ తేదీ వరకు రూ.7411.52 కోట్లు రైతుల ఖాతాల్లో వేశారు. మరో 3.62లక్షల మంది  రైతులకు  రూ.234.14కోట్లు అందించాల్సి ఉంది. 

జిల్లాల వారిగా అందిన నిధులు..
ఇప్పటివరకు అత్యధికంగా నల్గొండ జిల్లాలో 4,69,696 మంది రైతులకు 601.74 కోట్లు , సంగారెడ్డి జిల్లాలో 3,18,988 మందికి 370.74 కోట్లు,  నాగర్ కర్నూల్‌ జిల్లాలో 2,77,920 మందికి రూ.367.35 కోట్లు, ఖమ్మం జిల్లాలో 3,08,479 మంది అకౌంట్లలోకి రూ.356.12 కోట్లు జమ చేశారు.  రంగారెడ్డి జిల్లాలో 2,94,972 మందికి345.33 కోట్లు, సిద్దిపేట జిల్లాలో 2,94,362 మందికి310.65 కోట్లు డిపాజిట్ చేశారు. అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 33,452 మంది రైతుల ఖాతాల్లోకి రూ.33.65 కోట్లు మాత్రమే వేయడం గమనార్హం.