భద్రాచలం, వెలుగు: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో శుక్రవారం (జనవరి 9) 63 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 36 మందిపై రూ.1.19 కోట్ల రివార్డు ఉంది. ‘పునర్జన్మకు పునరావాసం’ స్కీమ్ కింద దర్బా, దక్షిణ బస్తర్, పశ్చిమ బస్తర్ మాఢ్, ఒడిశా రాష్ట్రంలో చురుకుగా వ్యవహరించిన మావోయిస్టులు ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట సరెండర్ అయ్యారు.
సరెండర్ అయిన వారిలో 18 మంది మహిళలు, 45 మంది పురుషులు ఉన్నారు. వీరిలో 36 మందిపైనే రివార్డు ఉంది. ఏడుగురిపై రూ.8లక్షలు, ఏడుగురిపై రూ.5లక్షలు, 8 మందిపై రూ.2లక్షలు, 11 మందిపై రూ.లక్ష, ముగ్గురిపై రూ.50 వేల చొప్పున రివార్డులు ఉన్నాయి. బస్తర్ ప్రాంతంలో శాంతి స్థాపనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎస్పీ తెలిపారు.
