దంచికొట్టిన హైదరాబాద్..ముంబైకి భారీ టార్గెట్

దంచికొట్టిన హైదరాబాద్..ముంబైకి భారీ టార్గెట్


ఫ్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాణించింది.  వాంఖడే స్టేడియంలో వీరబాదుడు బాదుతూ ముంబైకు 194 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ కాగా,  ప్రియం గార్గ్ 42 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సులు, ఫోర్లతో వాంఖడే స్టేడియాన్ని హోరెత్తించాడు. 44 బంతుల్లో 76 పరుగులతో చెలరేగాడు. అతనికి తోడు నికోలస్ పూరన్ 38 రన్స్ చేశాడు. అయితే చివర్లో హైదరాబాద్ వరుసగా వికెట్లను కోల్పోయింది. పూరన్, రాహుల్ త్రిపాఠి, మార్కరమ్ వెంటవెంటనే  ఔటయ్యారు.  అయితే లోయర్ ఆర్డర్ లో కేన్ విలియమ్సన్ 8 పరుగులు, వాషింగ్టన్ సుందర్  9 రన్స్ చేయడంతో హైదరాబాద్ 20 ఓవర్లలో 193 పరుగులు చేయగలిగింది. ముంబై బౌలర్లలో రమణదీప్ సింగ్ మూడు వికెట్లు దక్కించుకోగా, డానియల్ సామ్స్, మెర్డిత్, బుమ్రా తలో వికెట్ పడగొట్టారు.