గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బనస్కాంత జిల్లాలోని అమిర్ గఢ్ లోని ఇక్బాల్ గఢ్ నేషనల్ హైవేపై వేగంగా వచ్చిన ట్రక్కు అదుపు తప్పి ఇన్నోవా కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.
ప్రమాద సమయంలో ఇన్నోవా కారులో తొమ్మిది మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా రాజస్థాన్ కు చెందిన వారని పోలీసులు తెలిపారు. రాంగ్ రూట్ లో వచ్చిన ట్రక్కు ఢీ కొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
