కొత్త ఏడాదిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 7 టిప్స్

కొత్త ఏడాదిలో  ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 7 టిప్స్
  • నెలకు 10% రిటర్న్‌‌‌‌ ఇస్తామన్నోళ్ల దగ్గరికి పోవద్దు
  • బిజినెస్‌‌‌‌ సింపుల్‌‌‌‌గా ఉండాలె
  • మల్టీ బ్యాగర్లను గుర్తించడం ఈజీ కాదు

బిజినెస్ డెస్క్‌‌‌‌, వెలుగు:   కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. మార్కెట్‌‌‌‌లు సానుకూలంగా ఉన్నాయి. సెన్సెక్స్‌‌‌‌, నిఫ్టీ  2023 లో ఆల్ టైమ్ హై రికార్డ్‌‌‌‌లను తిరగరాశాయి.  ఎకానమీ బలంగా ఉండడంతో మిడ్‌‌‌‌క్యాప్‌‌‌‌, స్మాల్‌‌‌‌క్యాప్ షేర్లు కూడా ఇన్వెస్టర్లకు బంపర్ లాభాలిచ్చాయి. వచ్చే ఏడాది ఇన్వెస్టర్లు ఎటువంటి స్ట్రాటజీని ఫాలో కావాలి?  మనీకంట్రోల్‌‌‌‌ టాప్ 3 పోర్టుఫోలియో మేనేజ్‌‌‌‌మెంట్ సర్వీసెస్‌‌‌‌ (పీఎంఎస్‌)  మేనేజర్లతో మాట్లాడి  ఓ రిపోర్ట్ రెడీ చేసింది. ఏడు టిప్స్ ఫాలో కావాలని పేర్కొంది. 

1. నెంబర్లపై ఫోకస్‌‌‌‌


 లాంగ్ టెర్మ్‌‌‌‌ కోసం ఇన్వెస్ట్ చేసేవారు కంపెనీల నెంబర్లను (రిజల్ట్స్‌‌‌‌) జాగ్రత్తగా ఫాలో కావాలని  ఈక్విటాస్‌‌‌‌  చీఫ్‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ సిద్ధార్ధ బైయా పేర్కొన్నారు. సేఫ్టీ ఎక్కువగా ఉండే షేర్లలోనే ఇన్వెస్ట్ చేయాలని సలహా ఇచ్చారు.

2. ఫోకస్ చెదరొద్దు


2023 లో చాలా షేర్లు కొత్త గరిష్టాలకు చేరుకున్నాయి.  ఇన్వెస్టర్లకు బంపర్ లాభాలిచ్చాయి. దీంతో  చాలా మంది మల్టీ బ్యాగర్‌‌‌‌‌‌‌‌ షేర్లను కనిపెట్టడంపై ఫోకస్ పెడుతున్నారు. కానీ, వీటిని గుర్తించడం ఈజీ కాదని షెఫర్డ్స్‌‌‌‌ హిల్‌‌‌‌ ఎండీ రిషి గుప్తా అన్నారు. మల్టీ బ్యాగర్‌‌‌‌‌‌‌‌గా మారుతుందని నమ్మి గుర్తు తెలియని షేర్లలో ఇన్వెస్ట్ చేయడం కంటే ఫండమెంటల్‌‌‌‌గా స్ట్రాంగ్‌‌‌‌గా ఉన్న షేర్లలో డబ్బులు పెట్టడం బెటర్‌‌‌‌‌‌‌‌ అని సలహా ఇచ్చారు. మూడు నుంచి ఐదేళ్ల  కోసం ఫండమెంటల్‌‌‌‌గా స్ట్రాంగ్‌‌‌‌గా ఉన్న  20–30 షేర్లను ఎంచుకోవాలని పేర్కొన్నారు. 

3. వోలటాలిటీ 


ట్రెండింగ్ టాపిక్స్‌‌‌‌ ఆధారంగా మార్కెట్‌‌‌‌లో స్పందించొద్దని గుప్తా వెల్లడించారు. వచ్చే ఏడాది ఎలక్షన్స్‌‌‌‌ చుట్టూ మార్కెట్ తిరగొచ్చని,  జియోపొలిటికల్ అంశాల ప్రభావం కూడా పడొచ్చని అన్నారు. ‘నాయిస్‌‌‌‌ను పట్టించుకోవద్దు. వోలటాలిటీ ఎక్కువగా ఉన్న టైమ్‌‌‌‌లో ఇన్వెస్ట్‌‌‌‌ చేయడానికి ప్రయత్నించండి’ అని ఆయన సలహా ఇచ్చారు. కంపెనీల రిజల్ట్స్‌‌‌‌ను  ప్రభావితం చేసే అంశాలపై  ఫోకస్ పెట్టాలన్నారు.   ఏదైనా నెగెటివ్ న్యూస్ ఉంటే షేర్లను అమ్మేయాలని పేర్కొన్నారు.

4. సింపుల్‌‌‌‌గా..


సింపుల్‌‌‌‌గా ఉన్న బిజినెస్‌‌‌‌లలో ఇన్వెస్ట్ చేయాలని ఇన్వెస్ట్‌‌‌‌సావీ సీఈఓ ఆశిష్‌‌‌‌ గోయల్ పేర్కొన్నారు. కంపెనీ బిజినెస్‌‌‌‌ అర్థం కాకపోతే వాటికి దూరంగా ఉండాలని చెప్పారు. ‘ అన్ని రకాల బిజినెస్‌‌‌‌లను అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. మనం గుర్తించని రిస్క్‌‌‌‌లు ఎన్నో ఉంటాయి. ఉదాహరణకు  కంపెనీపై గ్లోబల్‌‌‌‌ అంశాల ప్రభావం ఎంతుంటుంది.  ప్రాఫిట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? గ్రోత్ ఏ సెగ్మెంట్లలో ఉంది? వంటివి  సింపుల్‌‌‌‌గా అర్థం చేసుకోగలిగే బిజినెస్‌‌‌‌లలో ఇన్వెస్ట్ చేయాలి’ అని వెల్లడించారు. సీనియర్ ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌  చార్లీ ముంగర్ కోట్‌‌‌‌ ‘ఇన్వెస్ట్ చేయడానికి మూడు బాస్కెట్‌‌‌‌లు ఎదురుగా ఉన్నాయి. అవును, కాదు, అర్థం చేసుకోవడం కష్టం’ ను ఆయన గుర్తు చేశారు.

5. అప్పు వద్దు..


లీవరేజ్‌‌‌‌తో ( బ్రోకర్ నుంచి తీసుకునే అప్పు)   మార్కెట్‌‌‌‌లో ఇన్వెస్ట్ చేయొద్దని బైయా పేర్కొన్నారు. లీవరేజ్‌‌‌‌ తీసుకొని షేర్లు కొంటే ఫ్రాపిట్స్ రావొచ్చేమో, కానీ, లాస్‌‌‌‌ మాత్రం కచ్చితంగా పెరుగుతుందని హెచ్చరించారు.  ‘ఇన్వెస్టర్ల అమ్ముల పొదిలో అప్పు ఉండకూడదు. మార్కెట్‌‌‌‌లో ఎప్పుడైనా, ఏమైనా జరగొచ్చు. ఏ అడ్వైజరు, ఎకనామిస్ట్‌‌‌‌, టీవీ కామెంటర్‌‌‌‌‌‌‌‌ , కచ్చితంగా నేను కాని  చార్లీ కాని ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేము’ అనే  బఫెట్‌‌‌‌ కోట్‌ను గుర్తు చేశారు. 

6. ట్రేడింగ్ టిప్స్‌‌‌‌..


టిప్స్ తీసుకొని ట్రేడింగ్ చేయడం  ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ,  తొందరగా  వచ్చే లాభాల కోసం ప్రయత్నించొద్దని  బైయా అన్నారు. ట్రేడింగ్‌‌‌‌ను గ్యాంబ్లింగ్‌‌‌‌లా చూడొద్దని అన్నారు. ‘నెలకు 10 శాతం రిటర్న్‌‌‌‌ ఇస్తామని ఆశ చూపే  వారి వైపు చూడొద్దు. అంత రిటర్న్‌‌‌‌ ఇవ్వగలిగే వాడు టిప్స్ అమ్ముకోడు’ అని గోయల్ అన్నారు. 

7. సెక్టార్లలో కాదు షేర్లలో


చాలా సార్లు ఇన్వెస్టర్లు సెక్టార్లలను దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ, చివరికి డబ్బులు పెట్టేది ఒక నిర్ధిష్టమైన కంపెనీలోనే. సెక్టార్ మంచి పనితీరు కనబరిచిన  కొన్ని కంపెనీల పెర్ఫార్మెన్స్ అద్వాన్నంగా ఉండొచ్చు. మిడ్‌‌‌‌క్యాప్‌‌‌‌, స్మాల్‌‌‌‌క్యాప్ సెక్టార్లలో ఇది క్లియర్‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తుంది. మంచిగా పెర్ఫార్మెన్స్ చేసే సెక్టార్‌‌‌‌‌‌‌‌లోని టాప్ షేరును కొనుగోలు చేయడం, ఫండమెంటల్స్‌‌‌‌ చూసుకోవడం మంచి స్ట్రాటజీ.