కిమ్ మందు ఖర్చు ఏటా రూ. 247 కోట్లు

కిమ్ మందు ఖర్చు ఏటా రూ. 247 కోట్లు

ఉత్తర కొరియా తీవ్రమైన ఆహార సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నా ఆ దేశ నియంత కిమ్ జోంగ్ఉన్ విలాసాలు ఏ మాత్రం తగ్గడం లేదు. కిమ్ విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు యూకే రక్షణ రంగ నిపుణులు ఓ పత్రికకు వెల్లడించారు. అతడు అత్యధికంగా 7 వేల డాలర్లు (రూ.5లక్షలకు పైగా) విలువ చసే హెన్నెస్సీ మద్యాన్ని తాగుతాడని తెలిపారు. అతడికి అవసరమైన విలాసవంతమైన మద్యం బ్రాండ్ల దిగుమతికే ఏటా 30 మలియన్ డాలర్ల(రూ.247 కోట్లు) ఖర్చుపెడతారని వెల్లడించారు. 

ఈ విషయాన్ని కొన్నేళ్ల క్రితం చైనా జనరల్ అడ్మిన్ స్ట్రేసన్ ఆఫ్ కస్టమ్స్ బహిర్గతం చేసినట్లు వెల్లడించారు. ఇక కిమ్ కు బ్రెజీలియన్ కాఫీ కోసం ఏటా 9.6లక్షల డాలర్లను వెచ్చిస్తున్నారు. అతడు తాగే సిగరెట్లు ప్రత్యేకమైన బంగారపు రేకుతు చుట్టి ఉంటాయని తెలిపారు. ఇంతే కాదు కిమ్ మద్యంతో పాటు తినేందుకు ఇటలీలలో ప్రత్యేకంగా తయారు చేసే పర్మాహామ్ (పోర్క్ తో తయారు చేసేది),స్విస్ చీజ్ ను ఉత్తర కొరియా దిగుమతి చేసుకుంటోంది. ఈ విషయాన్ని ఒకప్పటి కిమ్ వంటవాడు యూకేకు చెందిన ఓ పత్రికకు వెల్డించాడు