హైదరాబాద్‌‌లో 355 కరోనా కేసులు

హైదరాబాద్‌‌లో 355 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ప్రతి రోజు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కానీ అధికంగా కేసులు రికార్డవుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత 24 గంటల్లో 705 నమోదైనట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. శనివారం 851గా ఉంటే..శుక్రవారం ఈ కేసుల సంఖ్య 923గా ఉన్నాయి. 531 మంది ఆరోగ్యవంతులయ్యారని.. ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి 8, 10, 192 మంది కోలుకున్నారని పేర్కొంది. గత 24 గంటల్లో కరోనా నుంచి ఎవరూ చనిపోలేదని, మరణాల సంఖ్య 4 వేల 111గా ఉందని తెలిపింది. రికవరీ రేటు 98.82 శాతంగా ఉందని, మొత్తం 32 వేల 834 టెస్టులు నిర్వహించడం జరిగిందని పేర్కొంది. 

ఏ జిల్లాలో ఎన్ని కేసులు : ఆదిలాబాద్ 10, భద్రాద్రి కొత్తగూడెం 00, హైదరాబాద్ లో 355, జగిత్యాల 12, జనగాం 00, జయశంకర్ భూపాలపల్లి 00. జోగులాంబ గద్వాల 00, కామారెడ్డి 02, కరీంనగర్ 42, ఖమ్మం 21, కొమరంభీం ఆసిఫాబాద్ 03, మహబూబ్ నగర్ 16, మహబూబాబాద్ 13, మంచిర్యాల 09, మెదక్ 06, మేడ్చల్ మల్కాజ్ గిరి 35, ములుగు 02, నాగర్ కర్నూలు 03, నల్గొండ 15, నారాయణపేట 06, నిర్మల్ 01, నిజామాబాద్ 10, పెద్దపల్లి 10, రాజన్న సిరిసిల్ల 29, రంగారెడ్డి 48, సంగారెడ్డి 09, సిద్ధిపేట 06, సూర్యాపేట 01, వికారాబాద్ 07, వనపర్తి 00, వరంగల్ రూరల్ 05, హన్మకొండ 29, యాదాద్రి భువనగరి 00. మొత్తం - 705