గచ్చిబౌలిలో TS 07 HK 5555 బెంజ్ కారులో మంటలు.. పూర్తిగా బూడిదైపోయింది

గచ్చిబౌలిలో TS 07 HK 5555 బెంజ్ కారులో మంటలు.. పూర్తిగా బూడిదైపోయింది

హైదరాబాద్ గచ్చిబౌలి కొండాపూర్ లో రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగటం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. బంజారాహిల్స్ నుండి కొత్తగూడ వైపు వెళ్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు TS 07HK5555 ఒక్క సారిగా మంటలు రావడంతో  దట్టమైన పొగ,మంటలు అంటుకున్నాయి. మే 09 సాయంత్రం జరిగిన ఈ ప్రమాదం లో పెను ప్రమాదం తప్పింది.

రన్నింగ్ లో ఉండగానే మంటలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ మొయిజ్ (28) కారు ను పక్కకు నిలిపి కిందకు దిగి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలు కాకుండా ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. 

►ALSO READ | వనస్థలిపురంలో ఘోర ప్రమాదం.. హైవే పక్కన నడుచుకుంటూ వెళ్తున్న అక్క చెల్లెళ్లను ఢీకొన్న కారు... ఒకరు మృతి..

డ్రైవర్ సమాచారంతో ఘటన స్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుంది. అప్పటికే కారు దాదాపుగా కాలిపోయింది. మంటలు వ్యాపించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు.