మాయ‌దారి క‌రోనా : టీటీడీలో ఇప్ప‌టి వ‌ర‌కు 743మందికి పాజిటివ్

మాయ‌దారి క‌రోనా : టీటీడీలో ఇప్ప‌టి వ‌ర‌కు 743మందికి పాజిటివ్

మాయ‌దారి క‌రోనా టీటీడీ ఉద్యోగుల్ని ప‌ట్టిపీడిస్తుంది. టీడీపీ ఉద్యోగుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 743మందికి క‌రోనా సోకిన‌ట్లు ఆల‌య ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం మాట్లాడుతూ.. టీటీడీ ఉద్యోగుల్లో ఇప్పటి వరకు 743 మందికి కరోనా సోకిన‌ట్లు నిర్ధారించారు. వారిలో 402మంది క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టి ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయిన‌ట్లు వెల్ల‌డించారు. క‌రోనా కేంద్రాల్లో 338 మంది చికిత్స
పొందుతుంద‌న్నార‌ని చెప్పారు.

టీటీడీ వార్షిక బడ్జెట్ రూ. 3,200 కోట్లు కాగా, ఇందులో రూ. 1,350 కోట్లు కేవలం జీతాలకే ఖర్చు అవుతుందన్నారు. ఖర్చులు ఎంత తగ్గించుకున్నా ప్రస్తుతం నెలకు రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు ఖర్చు అవుతోందన్నారు. ఇప్పటి వరకు కార్పస్ ఫండ్ నుంచి ఎలాంటి నిధులు తీసుకోవటం లేదని వెల్లడించారు. భవిష్యత్తులో టీటీడీ బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలా? భక్తుల భాగస్వామ్య ఉండాలా? అనే అంశంపై టీటీడీ పాలకమండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు టీటీడీ ఆల‌య ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్