టౌన్లలో ప్రైవేటు.. ఊర్లలో సర్కార్

టౌన్లలో ప్రైవేటు.. ఊర్లలో సర్కార్

టౌన్లలో ప్రైవేటు స్కూళ్లకు ఊర్లలో సర్కార్ బడులకు స్టూడెంట్​ అడ్మిషన్ల తీరిది
ప్రైవేటు సంస్థల్లో అర్బన్​లో 77%.. రూరల్​ లో 33% స్టూడెంట్స్
సర్కారీ సంస్థల్లో రూరల్​లో 66%.. అర్బన్​లో 19.75% స్టూడెంట్స్
హైదరాబాద్​లోనూ భారీ తేడా.. విద్యాశాఖ లెక్కల్లో వెల్లడి

హైదరాబాద్, వెలుగురాష్ట్రంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యా సంస్థల అడ్మిషన్లలో భారీ తేడా కనబడుతోంది. టౌన్లలో ప్రైవేటు విద్యా సంస్థల్లో అడ్మిషన్లు ఎక్కువగా జరిగితే, రూరల్​ ప్రాంతాల్లో సర్కారీ విద్యాసంస్థల్లో ఎక్కువగా ఉంటున్నాయి. హైదరాబాద్​లో సర్కారీ బడులు, కాలేజీల్లో 16.64 శాతం మందే చదువుతుండగా.. ప్రైవేటులో 78.68 శాతం ఉన్నారు. రాష్ట్రంలో అతి తక్కువగా మేడ్చల్ ​జిల్లాలో 15.88 శాతం మంది మాత్రమే సర్కారీ బడులు, కాలేజీల్లో చదువుతుండగా.. అత్యధికంగా మెదక్ (73.05%)​, ములుగు (73.77%) జిల్లాల్లో చదువుతున్నారు. విద్యా శాఖ తీసిన లెక్కల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

ప్రైవేటులో స్టూడెంట్స్ పెరిగారు

రాష్ట్రంలో 2017–18తో పోలిస్తే 2018–19లో 27,629 మంది స్టూడెంట్లు​ పెరిగారు. సర్కారీ సంస్థల్లో 39,107 మంది తగ్గిపోగా.. ప్రైవేటులో 77,447 మంది పెరిగారు. సర్కారులో విద్యా సంస్థల సంఖ్య పెరిగినా స్టూడెంట్లు తగ్గిపోయారు. స్టూడెంట్ల సంఖ్యలో హైదరాబాద్​ జిల్లా టాప్​లో ఉంది. ఇక్కడ 9,46,348 మంది స్టూడెంట్స్ ఉండగా, అతి తక్కువగా ములుగు జిల్లాలో 42,684 మందే ఉన్నారు.

స్టూడెంట్ల లెక్కలు ఇవీ..

యూడైస్​ 2018–19 లెక్కల ప్రకారం.. 33 జిల్లాల్లో 42,355 స్కూళ్లు, ఇంటర్​ స్థాయిలోపు కాలేజీలు ఉన్నాయి. వాటిలో మొత్తంగా 65,56,701 మంది స్టూడెంట్లు చదువుతున్నారు.

మొత్తం స్టూడెంట్లలో ఎలిమెంటరీ స్థాయి వారు 47,36,152 మందికాగా, మిగతా వారంతా సెకండరీ, హయ్యర్ సెకండరీ స్టూడెంట్లు.

సర్కారీ విద్యాసంస్థల్లో 28,22,435 మంది, ఎయిడెడ్​లో 1,07,531 మంది, ప్రైవేటులో 36,13,352 మంది, గుర్తింపు లేని ఇతర విద్యాసంస్థల్లో 13,383 మంది చదువుతున్నారు.

హైదరాబాద్, కరీంనగర్, మేడ్చల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, వరంగల్ అర్బన్​ జిల్లాల్లో ‘ప్రైవేటు’ చదువులు ఎక్కువగా ఉన్నాయి.

రూరల్​లో సర్కారు హవా..

రూరల్​ఏరియాల్లోని 30,982 (73.15%) విద్యాసంస్థల్లో 33,12,913 మంది చదువుతుండగా.. అర్బన్​ఏరియాల్లోని 11,373 ( 26.85%) విద్యాసంస్థల్లో 32,43,788 మంది ఉన్నారు.

రూరల్​ ప్రాంతాల్లోని స్టూడెంట్లలో సర్కారీ​సంస్థల్లో 21,81,875(65.86%) మంది, ప్రైవేటులో 11,16,637 (33.71%), ఎయిడెడ్​లో 10,659 (0.32%), ఇతర విద్యాసంస్థల్లో 3,742 (0.11%) మంది చదువుతున్నారు.

అర్బన్​ఏరియాలో ప్రైవేటు సంస్థల్లో 24,96,715 (76.97%) మంది, సర్కారు సంస్థల్లో 6,40,560 (19.75%), ఎయిడెడ్​లో 96,872 (2.99%), ఇతర సంస్థల్లో 9,641 (0.30%) మంది ​ఉన్నారు.

see also: కమలం గ్రాఫ్​ పెరిగింది

see also: పాల సేకరణ ధర రూ.2 పెరిగింది

see also: ఈరోజే చైర్‌‌ పర్సన్లు, మేయర్ల ఎన్నిక

see also: ‘హంగ్​’లలో ఎక్కువ టీఆర్​ఎస్​ చేతికి?