టీజీఆర్‌‌‌‌జేసీ సెట్‌‌ కు 77.77%  మంది అటెండ్

టీజీఆర్‌‌‌‌జేసీ సెట్‌‌ కు 77.77%  మంది అటెండ్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలోని గురుకుల జూనియర్ కాలేజీలు, ఎక్సలెన్సీ కేజీబీవీల్లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన టీజీఆర్‌‌‌‌జేసీ సెట్ ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 77.77 శాతం మంది విద్యార్థులు హాజరైనట్టు సెట్ కన్వీనర్ రమణకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 317 పరీక్షా కేంద్రాల్లో ఈ ఎగ్జామ్ నిర్వహించారు. పరీక్ష కోసం మొత్తం 76,174 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 59,244 మంది పరీక్షకు హాజరయ్యారని కన్వీనర్ వివరించారు.