గ్రేటర్​లో 8 హై రిస్క్ ప్రాంతాలివే..

గ్రేటర్​లో 8 హై రిస్క్ ప్రాంతాలివే..

హైదరాబాద్​, వెలుగు: గ్రేటర్​ హైదరాబాద్​ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటిదాకా నమోదైన కేసుల్లో 76 శాతానికిపైగా కేసులు ఇక్కడే ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా 34,671 మంది కరోనా బారిన పడగా, అందులో 26,574 మంది గ్రేటర్​ పరిధిలోనే ఉన్నారు. టెస్టులు పెంచుతున్న కొద్దీ ఎక్కువ కేసులూ బయటపడుతున్నాయి. యాంటీజెన్​ టెస్టులను రాష్ట్ర ప్రభుత్వం లెక్కలోకి తీసుకోవట్లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటినీ చేరిస్తే కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. పరిస్థితి తీవ్రమవుతుండడంతో బల్దియా మళ్లీ కంటెయిన్​మెంట్​ జోన్లను ఏర్పాటు చేస్తోంది. 500కుపైగా కేసులున్న 8 ప్రాంతాలను హైరిస్క్​ జోన్లుగా గుర్తించింది. ఆ ఏరియాల్లో కంటెయిన్​మెంట్​ జోన్లను ఏర్పాటు చేసి.. స్పెషల్​ ఆఫీసర్లను నియమించారు కమిషనర్​ లోకేశ్​ కుమార్​.

ఇవే హైరిస్క్​ ప్రాంతాలు

యూసుఫ్​గూడ, అంబర్​పేట్​, మెహదీపట్నం, కార్వాన్​, చాంద్రాయణగుట్ట, చార్మినార్​, రాజేంద్రనగర్​, కుత్బుల్లాపూర్​​సర్కిళ్లను హైరిస్క్​ ప్రాంతాలుగా గుర్తించారు. ఒక్కో చోట 10 నుంచి 20 దాకా.. మొత్తంగా వంద కంటెయిన్​మెంట్​ జోన్లను ఏర్పాటు చేయాలని జీహెచ్​ఎంసీ అధికారులు భావిస్తున్నారు. అక్కడ తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించనున్నారు. అయితే, అక్కడ పనిచేసేందుకు వందల సంఖ్యలో సిబ్బంది అవసరమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక, హోం ఐసోలేషన్​లో ఉంటున్న పేషెంట్లు బయటకు రాకుండా కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ల వల్ల వ్యాప్తి ఎక్కువగా ఉంటోందని భావిస్తున్న​అధికారులు స్పెషల్​ ఫోకస్​ పెట్టారు.

రాజ్ భవన్ లో  10 మంది సిబ్బందికి కరోనా