డసాల్ట్ సంస్థతో అనిల్ అంబానీ కంపెనీ డీల్.. ఫాల్కన్ జెట్స్ తయారీ.. దూసుకుపోతున్న స్టాక్

డసాల్ట్ సంస్థతో అనిల్ అంబానీ కంపెనీ డీల్.. ఫాల్కన్ జెట్స్ తయారీ.. దూసుకుపోతున్న స్టాక్

Falcon 2000 Jet: అనిల్ అంబానీ ఇదొక ఫెయిల్డ్ బిజినెస్ మెస్ స్టోరీ అంటూ గతంలో వార్తలు వచ్చేవి. కానీ ప్రస్తుతం ఆయన ప్రయాణం లక్షల మంది యువ వ్యాపారవేత్తలకు మార్గదర్శకంగా మారుతోంది. పడటం కాదు దాని నుంచి తిరిగి ఎలా లేవాలి, ఎలా నిలదొక్కుకోవాలి అనే అంశాలను అనిల్ జీవితం అందిస్తోంది. వ్యాపారవేత్తగా తన రెండవ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన అంబానీ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులు, విజయాలతో ముందుకు సాగుతున్నారు. 

తాజాగా అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ ఫ్రా సంస్థ రఫెల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ డసాల్ట్ ఏవియేషన్ సంస్థతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద కంపెనీ అనుబంధ సంస్థ రిలయన్స్ ఏరో స్ట్రక్చర్ లిమిటెడ్ ఫ్రెంచ్ సంస్థ డసాల్ట్ ఏవియేషన్ మధ్య డీల్ జరిగింది. దీనికింద డసాల్ట్ సంస్థకు చెందిన ఫాల్కన్ 2000 బిజినెస్ట్ జెట్లను సంయుక్తంగా భారతదేశంలో తయారు చేసేందుకు ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ వార్త బయటకు రావటంతో రిలయన్స్ ఇన్ ఫ్రా సంస్థ షేర్లు నేడు 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ తాకాయి. 

ALSO READ | Defence Stock: ఫ్రెంచ్ సంస్థతో డ్రోన్ మేకర్ ఒప్పందం.. ఆ కిల్లర్ డ్రోన్స్ ఇండియాలో తయారీ!

ఒప్పందం కింద డసాల్ట్ సంస్థ తొలిసారిగా భారతదేశంలో తన ఫాల్కన్ విమానాలను అసెంబుల్ చేయాలని నిర్ణయించింది. ఫ్రాన్స్ బయట వీటిని అమెరికా, కెనడా, బ్రెజిల్ లో ఉత్పత్తి చేస్తుండగా ఈ జాబితాలోకి భారత దేశం కూడా అంబానీ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. 2028 చివరి నాటికి కార్పొరేట్, సైనిక అవసరాల కోసం డసాల్ట్ మేడ్ ఇన్ ఇండియా ఫాల్కన్ 2000 జెట్స్ డెలివరీని మెుదలుపెట్టే లక్ష్యంతో తాజా డీల్ జరిగింది. 

రిలయన్స్ ఇన్ ఫ్రా సంస్థ వరుసగా డిఫెన్స్ రంగంలో అనేక ప్రాజెక్టులను చేపడుతూ వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. దీని ఫలితంగా గడచిన ఏడాది కాలంలో కంపెనీ షేర్లు ఏకంగా 83 శాతం పెరిగి ఇన్వెస్టర్లకు భారీ రాబడులను అందించాయి. అలాగే కంపెనీ షేర్లు 2025 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 20 శాతానికి పైగా రాబడిని అందించాయి. కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ఠ ధర రూ.421 వద్ద ఉండగా.. నేడు మార్కెట్లు ముగిసే సమయంలో స్టాక్ ధర ఒక్కోటి రూ. 386.50 వద్ద తన ప్రయాణాన్ని ముగించింది.